పవన్.. మెగా ఫ్యామిలీ వేర్వేరని ఎవరు చెప్పారయ్యా

Update: 2018-04-09 11:31 GMT

పవన్ కళ్యాణ్ ఇప్పుడు మెగా ఫ్యామిలీతో కలిసి ఆనందంగానే గడుపుతున్నాడు. వీలైనప్పుడల్లా మెగాస్టార్ చిరు ఇంటికి వెళ్లి తన కుటుంబంతో మమేకం అవుతున్నాడు. ఇప్పటికే అన్న చిరు ని విమర్శించడం మానేసి.. పొగుడుతున్న పవన్ కళ్యాణ్.. అన్న కొడుకు రామ్ చరణ్ పుట్టినరోజు రోజున అన్న వదినలతో కలిసి చరణ్ కి మంచి గిఫ్ట్ ఇవ్వడమే కాదు హ్యాపీ గా ఫొటోస్ కూడా దిగి వచ్చాడు. ఇక ఆ మధ్యలో మెగా ఫ్యామిలీపై వచ్చిన వార్తలన్నీ ఈ మధ్య మెగా ఫ్యామిలి జరుగుతున్న విషయాలతో గాలి వార్తల్లా కొట్టుకుపోయాయి.

ఇక చరణ్ పుట్టినరోజునాడు పవన్ కళ్యాణ్ తన కొడుకు అకీరా ని తీసుకుని చిరంజీవి ఇంటి దగ్గర సందడి చేసాడు. నిన్న ఆదివారం అకీరా నందన్ పుట్టినరోజు కావడంతో చరణ్ పుట్టినరోజునాడు అకీరా, పవన్ కళ్యాణ్ , చరణ్ లుకలిసున్న ఫోటోని రామ్ చరణ్ సోషల్ మీడియా లో షేర్ చేసాడు. మరి మెగావారసుడయినా అకీరాకి మెగా హీరోలంతా సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు కూడా. మరి అందరూ అలా విషెస్ తెలియజేస్తే చరణ్ మాత్రం తన తమ్ముడు అకీరా, బాబాయ్ కళ్యాణ్ తో దిగిన ఫోటో ద్వారా తన తమ్ముడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

మరి అలా పవన్ కళ్యాణ్ తో చరణ్ ని చూస్తేనే ఆనందం పట్టలేని మెగా ఫాన్స్ ఇప్పుడు పవన్ కొడుకుతో సహా చరణ్ కూడా ఒకే ఫ్రెమ్ లో కనబడితే ఇక వాళ్ళ ఆనందం వర్ణనాతీతం. ఇక ఆ పిక్ లో పవన్ కన్నా అకీరానే హైట్అన్నట్టుగా అకీరా చాలా ఎత్తుగా కనబడుతున్నాడు. మరి భార్యతో విడాకులు తీసుకున్నాక కూడా పవన్ మాత్రం తన పిల్లల విషయంలో ఎంత బాధ్యతగా ఉంటున్నాడు అనేది ఈ ఫోటో ప్రూవ్ చేస్తుంది.

Similar News