పవన్ తో పూరి మధ్యలో బండ్ల?

పవన్ కళ్యాణ్ వరస సినిమాలకు సైన్ చేస్తూ ఫాన్స్ కి పూనకం తెప్పిస్తున్నాడు. వకీల్ సాబ్ షూటింగ్ ఎప్పుడు పూర్తయితే అప్పుడు క్రిష్ సినిమా తర్వాత హరీష్ [more]

Update: 2020-10-03 05:12 GMT

పవన్ కళ్యాణ్ వరస సినిమాలకు సైన్ చేస్తూ ఫాన్స్ కి పూనకం తెప్పిస్తున్నాడు. వకీల్ సాబ్ షూటింగ్ ఎప్పుడు పూర్తయితే అప్పుడు క్రిష్ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో అలాగే సురేందర్ రెడ్డితో సినిమా లు లైన్ లో పెట్టాడు. పవన్ కళ్యాణ్ ఇంత త్వరగా ఇంత స్పీడు గా మూవీస్ కి కమిట్ అవుతాడు ఎవరూ ఊహించనైనను లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కి సినిమా చేస్తానని మాటిచ్చినట్టుగా బండ్ల గణేశే చెప్పాడు. దానితో పవన్ – బండ్ల దర్శకుడు డాలి అనే ప్రచారం జరిగింది. మధ్యలో బండ్లకి కేవలం మాట మాత్రమే ఇచ్చాడు. కానీ ఇప్పట్లో పవన్ బండ్ల గణేష్ సినిమా చెయ్యడని కూడా అన్నారు.

అయితే తాజాగా బండ్ల గణేష్ ముందే కథని, దర్శకుడిని లైన్ లో పెట్టుకున్నాకే పవన్ దగ్గరికి వెళ్లి మాట తీసుకున్నాడని అంటున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేసిన పూరి జగన్నాధ్ తో పవన్ కళ్యాణ్ సినిమాని బండ్ల సెట్ చేసుకున్నాడనే టాక్ సోషల్ మీడియాలో మొదలైంది. బండ్ల పూరి తో క్లోజ్ అయ్యి పవన్ కి కథ రాయమని.. దానితో పవన్ ని ఒప్పిద్దామని చెప్పి ముందే పవన్ దగ్గర మాట తీసుకుని పవన్ చేత బండ్ల సినిమాకి కమిట్ చేయించాడట. తర్వాత పూరి తో పవన్ కి మీటింగ్ ఏర్పాటు చేసి పవన్ – పూరి – బండ్ల కాంబోని బండ్ల అధికారికంగా ప్రకటిస్తాడనే టాక్ అయితే ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News