పవన్ టైటిల్ కై కుస్తీలు!!

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మరో 20 రోజుల షూటింగ్ పూర్తయితే.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని.. థియేటర్స్ తెరవగానే బాక్సాఫీసుని బద్దలు కొట్టేది. కానీ [more]

Update: 2020-07-09 16:04 GMT

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మరో 20 రోజుల షూటింగ్ పూర్తయితే.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని.. థియేటర్స్ తెరవగానే బాక్సాఫీసుని బద్దలు కొట్టేది. కానీ కరోనా లాక్ డౌన్ తో ఆ 20 రోజుల షూటింగ్ ఆగడంతో.. ఇప్పుడు సినిమా దసరా నా లేదా.. సంక్రాతి నా… అనే డైలమాలో ఉంది. ఇక వకీల్ సాబ్ ఎప్పుడు ఫినిష్ అవుతుందా నా వర్క్ మొదలెట్టుకోవాలి అని పవన్ నెక్స్ట్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఎదురు చూస్తున్నాడు. క్రిష్ తో పవన్ కళ్యాణ్ పిరియాడికల్ నేపథ్యంతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ దొంగ గా కనిపిస్తాడని.. కోహినీర్ వజ్రం కథ చుట్టూ కథ తిరుగుతుందని అంటున్నారు.  

అందుకే ఈ సినిమాకి విరూపక్ష అనే టైటిల్ ని పెడుతున్నట్టుగా దాదాపుగా ఫైనల్ అంటూ వార్తలొచ్చాయి. అయితే తాజాగా మరో రెండు టైటిల్ ని క్రిష్ అండ్ పవన్ కళ్యాణ్ లు పరిశీలిస్తున్నట్లుగా అది కూడా సీనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ టైటిల్ అయిన బందిపోటు, గజదొంగ అనే టైటిల్స్ ఎలా ఉంటాయి అనే ఆలోచనలో ఉన్నారట. కథ రీత్యా గజదొంగ లేదా బందిపోటు అనే టైటిల్స్ బాగా సరిపోతాయని అలాగే ఈ సినిమాకి మాస్ అప్పీల్ తో పాటుగా కమర్షియల్ హంగులు ఉంటాయని అందుకే ఈ టైటిల్ లో ఏదో ఒకటి ఫైనల్ చేస్తారని అంటున్నారు. 

Tags:    

Similar News