పవన్ అలా అయితే ఒప్పుకుంటారా?

పవన్ కళ్యాణ్ పోలీస్ లుక్ లోను, స్టైలిష్ లుక్ లోను అదిరిపోతాడు. కానీ డాన్ గాను, అలాగే కాస్త రఫ్ లుక్ లోను అంతగా అనిపించడు. గుడుంబా [more]

Update: 2020-11-03 06:00 GMT

పవన్ కళ్యాణ్ పోలీస్ లుక్ లోను, స్టైలిష్ లుక్ లోను అదిరిపోతాడు. కానీ డాన్ గాను, అలాగే కాస్త రఫ్ లుక్ లోను అంతగా అనిపించడు. గుడుంబా శంకర్ లో కాస్త రఫ్ కేరెక్టర్ అయినా పవన్ కళ్యాణ్ స్టైలిష్ గానే కనబడతాడు. అలాగే పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ కేరెక్టర్ అంటే మాసిన గెడ్డం లుక్ అవి ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. మరి డాన్ గా స్టైలిష్ గా కనబడితే ఓకె.. కాదు మాస్ గా డిఫ్రెంట్ లుక్ లో రఫ్ లుక్ అంటే పవన్ గట్టిగా ఆలోచించుకోవాల్సిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డాన్ లుక్ గురించి ఎందుకింత డిస్కషన్ అంటే.. పవన్ కళ్యాణ్ హరీష్ శనకర్ సినిమాలో డాన్ అవతారమెత్తబోతున్నాడట.

అది కూడా కొద్దీ నిమిషాల పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ డాన్ గా కనిపించనున్నాడని.. అంటున్నారు. మరి డాన్ అంటే లుక్ ఎలా ఉంటుందో ఫాన్స్ అప్పుడే ఓ ఐడియా కి వచ్చేసారు. అందుకే వామ్మో పవన్ మనకా లుక్ వద్దు.. నువ్ స్టైలిష్ గానే కనబడు ప్లీజ్ అంటున్నారట. మరి గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ అయినా మాస్ స్టయిల్ లో ఆ కేరెక్టర్ కి జీవం పోసాడు. మరి హరీష్ ఇప్పుడు మాస్ స్టయిల్ లో పవన్ ని డాన్ అవతారమెత్తించడం అనేది కథ ప్రకారం కీలకం అయితే ఓకె.. లేదంటే ఏదో పవన్ ఫాన్స్ కోసం పవన్ అభిమానం కోసం అంటే కష్టం సుమీ.

Tags:    

Similar News