పవిత్రా లోకేష్ ఆసక్తికర విషయాలను పంచుకుంది

Update: 2018-08-12 16:01 GMT

పుట్టింది పెరిగింది కన్నడలో ఐన...తెలుగులో అందమైన తల్లి పాత్రలతో అందరి హృదయాలు దోచుకున్న నటి పవిత్రా లోకేష్ తెలుగులో చాలామంది టాప్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. తాజాగా ఆమె ఒక డైలీ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన తండ్రి మైసూర్ లోకేశ్ దాదాపు 400 సినిమాల్లో నటించారని..తాను పదో తరగతిలో ఉన్నప్పుడే తన తండ్రి మరణించాడని..ఆయన మరణంతో ఎన్నో సమస్యలు వచ్చాయి అని ఆమె చెప్పుకొచ్చారు.

తన తల్లి టీచర్ గా పని చేస్తూనే.. డేటా ఎంట్రీ లో పని చేసి రెగ్యులర్ డిగ్రీ, ఓపెన్ వర్శిటీలో పీజీ చేసిందని చెప్పింది. ఇక తన ఇంటికి స్టార్ హీరో అంబరీశ్ వచ్చినప్పుడు తనను సినిమాల్లోకి రావాలని కోరడంతో ఆలా ఇండస్ట్రీ కి వచ్చానని..అప్పుడు నా వయసు 16 ఏళ్ళు అని..తండ్రి స్టార్ కావడంతో గ్రాండ్ వెల్ కం ఉంటుందని భావించానని.. ఆలా ఆలోచించడం తప్పని తెలిసిందని ఆమె చెప్పారు.

సినిమాల్లో ఇష్టం లేకుండానే ప్రవేశించిన తాను చాలా ఇబ్బందులు పడ్డానని..ఎవరు మాట సాయం కూడా చేయలేదని ఆమె చెప్పారు. శ్రీదేవిలా స్టార్ హీరోయిన్ గా ఎదగాలని వచ్చిన తనకు ప్రతీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చాన్సులే వచ్చాయని పవిత్రా లోకేశ్ వ్యాఖ్యానించింది. లావుగా..ఎత్తుగా ఉండటం తనకు మైనస్ అయిందని చెప్పారు. బతకడం, ఇల్లు గడవటం కోసం కొన్ని నెగటివ్ రోల్స్ చేయాల్సి వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. కన్నడ సినిమాల లో చూసి భీమనేని శ్రీనివాసరావు.. తెలుగులో 'దొంగోడు'లో చాన్స్ ఇచ్చాడని ఆ తర్వాత 'ప్రస్థానం'తో వెనక్కు తిరిగి చూడలేదని చెప్పింది

Similar News