వామ్మో.... రాము మళ్లీ పవన్ పైన..!

Update: 2018-05-13 08:41 GMT

ఈమధ్య రామ్ గోపాల్ వర్మ తన టార్గెట్ ఫిక్స్ చేసుకుని దానిపై ట్వీట్స్ వేస్తూ వెళ్తున్నాడు. అయన ఎవరో కాదు... పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పై తనదైన శైలిలో రోజుకొక ట్వీట్ వేయందే నిద్ర కూడా పోట్లేదేమో. రీసెంట్ గా పవన్ కళ్యాణ్.. రవి తేజ 'నేల టికెట్' సినిమా ఆడియో లాంచ్ కి వెళ్ళాడు. అక్కడ రవితేజ పక్కన కూర్చున్న పవన్.. రవి తేజ వేసుకున్న టార్న్ జీన్స్ పై పవన్ జోకులు వేశారు. కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతూ మరీ కుర్రాడు అయిపోతున్నాడంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. రవితేజ ఫ్యాంటు మీద పవన్ చేతులు వేసి.. ఫ్యాంట్ చిల్లు దగ్గర పట్టుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్....

దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతే కాదు వీరి చర్యలు ఊహాతీతం వర్మ అంటూ.. పవన్ అంటే ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను చూసిన వర్మ..ఇలా ట్వీట్స్ చేసాడు. 'అజ్ఞాతవాసి' సినిమాలో పవన్ కళ్యాణ్ లో ఈ యాంగిల్ ఉందని ఎక్స్ ప్రెషన్ ను బట్టి రవితేజ మొహంలో క్లియర్ గా ‘టచ్ చేసి చూడు’ టైప్ లో తెలుస్తుంది. కానీ ఈ సీక్రెట్ మెగా ఫ్యామిలీకి, జనసేన పార్టీ వారికి తెలిసుండదు. బట్ పీకే గిల్లుడులో ‘నేల టిక్కెట్టు’ కనెక్షన్స్ కనిపిస్తున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ ని ఏకి పారేసాడు. అంతే కాకుండా.

ఏంటిది ఇలా.....

పవన్ కళ్యాణ్ కి రవి తేజ తొడ మీద ఉన్న శ్రద్ధలో... జస్ట్ సగం రెండు రాష్ట్రాల మీద పెడితే అబ్బో.. అత్యంత సస్యశ్యామలం. రవి తేజ ఎడమ తొడకి..పవన్ కళ్యాణ్ కుడి చేతికి సంబంధం ఏంటో ఆ దేవుడికే తెలియాలి. ఈ విషయాలు జనసేన వాళ్లకే తెలియాలి. కానీ రవి తేజ ఎడమ తొడ మీద చాలా మక్కువ ఉన్న విషయం పవన్ కళ్యాణ్ మొహంలో ఉన్న ఆనందం చూస్తూనే కనపడుతుందని.. పవన్ కళ్యాణ్ ని కడిగేసాడు రాము.

Similar News