‘పేప‌ర్ బాయ్’ని మెచ్చిన గీతా ఆర్ట్స్

Update: 2018-08-27 06:15 GMT

సంతోష్ శోభ‌న్, రియా సుమ‌న్ జంట‌గా న‌టిస్తున్న పేప‌ర్ బాయ్ ఆగ‌స్టు 31న విడుద‌ల కానుంది. ఈ చిత్ర థియెట్రిక‌ల్ రైట్స్ ను ప్ర‌ముఖ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుంది. నిర్మాత‌లు అల్లు అర‌వింద్, బ‌న్నీవాసు, ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ కు ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా షో వేసి చూపించారు ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది. ఈయ‌నే పేప‌ర్ బాయ్ చిత్రాన్ని నిర్మించారు. సినిమా చూసిన త‌ర్వాత మెచ్చుకుని ఈ రైట్స్ తీసుకుంది గీతా ఆర్ట్స్. మంచి రేట్ ఇచ్చి ఈ హ‌క్కుల్ని సొంతం చేసుకున్నారు అల్లు అర‌వింద్. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ కు మిలియ‌న్ వ్యూస్ దాటి.. మంచి రెస్పాన్స్ అందుకుంది. విడుద‌ల‌కు ముందు ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

న‌టీన‌టులు:

సంతోశ్ శోభ‌న్, రియాసుమ‌న్, తాన్యాహోప్, పోసాని కృష్ణ‌ముర‌ళి, అభిషేక్ మ‌హ‌ర్షి, విద్యురామ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, బిత్తిరి స‌త్తి, స‌న్నీ, మ‌హేశ్ విట్టా త‌దిత‌రులు

సాంకేతిక విభాగం:

ద‌ర్శ‌కుడు: జ‌య‌శంక‌ర్

నిర్మాత‌లు: సందప‌త్ నంది, రాములు, వెంక‌ట్ మ‌రియు న‌ర‌సింహా

నిర్మాణ సంస్థ‌లు: సంరప‌త్ నంది టీం వ‌ర్క్స్, బిఎల్ఎన్ సినిమా మ‌రియు ప్ర‌చిత్ర క్రియేష‌న్స్

సంగీతం: భీమ్స్ సిసిరేలియో

సినిమాటోగ్ర‌ఫీ: సౌంద‌ర్ రాజన్

ఎడిట‌ర్: త‌మ్మిరాజు

ఆర్ట్ డైరెక్ట‌ర్: రాజీవ్

ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ముర‌ళి మామిళ్ల

స్క్రిప్ట్ కో ఆర్డినేట‌ర్: సుధాక‌ర్ పావులూరి

పిఆర్ఓ: వం‌శీ శేఖ‌ర్

Similar News