పంతం మొదటి రోజు కలెక్షన్స్!

Update: 2018-07-06 06:38 GMT

గోపీచంద్ - మెహ్రీన్ కౌర్ జంటగా కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో తెరకెక్కిన పంతం సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే గత వారం సరైన సినిమాలేవీ థియేటర్స్ లో లేకపోవడంతో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. టాక్ తో సంబంధం లేకుండా గోపీచంద్ పంతం సినిమా కలెక్షన్స్ రాబట్టింది. యావరేజ్ టాక్ అంటే.. కలెక్షన్స్ కూడా యావరేజ్ గానే ఉంటాయనుకున్నాను. కానీ పంతం కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3.22 కోట్లు షేర్ తో 5.2 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే గోపీచంద్ సినిమాకి ఇలా మంచి ఓపెనింగ్స్ రావ‌డానికి ప్ర‌ధాన‌ కారణం ఆ సినిమాకి చేసిన ప్రమోషన్స్ అనే మాట గట్టిగా వినబడుతుంది.

ఏరియా: ఫస్ట్ డే షేర్

నైజాం - 1,12,00,000

సీడెడ్ - 47,00,000

నెల్లూరు - 12,00,000

గుంటూరు - 33,00,000

కృష్ణ - 15,77,125

వెస్ట్ గోదావరి - 16,35,976

ఈస్ట్ గోదావరి - 20,92,000

ఉత్తరాంధ్ర - 34,79,085

ఏపీ, టీస్ షేర్ - 2.92 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా - 20,00,000

ఓవర్సీస్ - 10,00,000

వరల్డ్ వైడ్ షేర్ 3.22 కోట్లు,

గ్రాస్ 5.2 కోట్లు

Similar News