ఓవర్సీస్ లో 2.ఓ హడావుడి ఏది..?

Update: 2018-11-30 11:30 GMT

నిన్న విడుదలైన 2.ఓ సినిమాకి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ క్రిటిక్స్ నుండి 2.ఓ కి పాజిటివ్, సూపర్ హిట్ మార్కులే పడ్డాయి. అయితే ఒక సెక్షన్ ప్రేక్షకులు 2.ఓ సినిమా సూపర్ హిట్.. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చెయ్యాలి, దర్శకుడు శంకర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అంటున్నారు. మరోవైపు మరోరకం ప్రేక్షకులు ఈ సినిమా 3డీలో చూస్తేనే బాగుంటుంది. కానీ అందరికి 3డీ అందుబాటులో ఉండదుగా... అలాగే క్లాస్ ఆడియన్స్ కి తప్ప మాస్ ఆడియన్స్ కి కాదు అని అంటున్నారు.

రికార్డులు తుదిచేస్తుందనుకుంటే...

మరి ఇండియావైడ్ గా 2.ఓ మొదటి రోజు 70 కోట్లకు పైగా షేర్ రాబట్టిందని అంటున్నారు. ఇక దేశ విదేశాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే ఇతర స్టార్ హీరోలకు లేదు. కనీసం బాలీవుడ్ హీరోలకు కూడా రాజినీకున్న ఫాలోయింగ్ విదేశాల్లో లేదు. మరి ఇక్కడ రజినీ సినిమా యావరేజ్ పడినప్పటికీ.. ఓవర్సీస్ లో రజినీకాంత్ సినిమాల జోరు మాములుగా ఉండదు. మరి ఇక్కడ బాహుబలి రికార్డులను తుడిచేస్తుంది అన్న వారికి 2.ఓ సినిమా చూడగానే సమాధానం దొరికింది. కానీ ఓవర్సీస్ లో బాహుబలిని తలదన్నే సినిమా 2.ఓ అవుతుంది అనుకుంటే... అక్కడ 2.ఓ సందడి పెద్దగా కనిపించడం లేదు.

ఓవర్సీస్ లో బాహుబలిదే హవా

2.ఓ ప్రిమియర్లతో కలిపి ఓవర్సీస్ లో 1.4 మిలియన్ డాలర్ల రాబట్టినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి బాహుబలి ఫస్ట్ డేనే అంటే ప్రీమియర్స్ తో కలిపి 4 మిలియన్ మార్క్ దాటేసింది. మరి ఇదంతా చూస్తుంటే బాహుబలికి 2.ఓ సలాం కొట్టినట్లుగా లేదు. అందుకే ఓవర్సీస్ లో 2.ఓ సందడి కనబడటం లేదు అంటూ సోషల్ మీడియాలో బాహుబలి ఫ్యాన్స్ హంగామా షురూ చేశారు.

Similar News