వేరే దిక్కు లేదు..కమిట్ అవ్వాల్సిందే!!

కరోనా లాక్ డౌన్ ఇంత కాలం ఉంటుంది అని ఎవ్వరూ ఊహించనైనా ఊహించలేదు. నెల నుండి రెండు నెలల టైం ని ఎక్సపెక్ట్ చేసిన వారికీ కరోనా [more]

Update: 2020-07-05 09:12 GMT

కరోనా లాక్ డౌన్ ఇంత కాలం ఉంటుంది అని ఎవ్వరూ ఊహించనైనా ఊహించలేదు. నెల నుండి రెండు నెలల టైం ని ఎక్సపెక్ట్ చేసిన వారికీ కరోనా వరసగా భారీ షాకులిస్తూనే ఉంది. మార్చ్ చి-వరి నుండి జూన్, జులై లో అయినా సినిమా థియేటర్స్ తెరుచుకుంటాయనుకుంటే.. ఆగష్టు లో కూడా థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. దసరాకైనా థియేటర్స్ ఓపెన్ అయినా.. ప్రేక్షకులు కరోనా భయంతో వెళ్లే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే మార్చ్ లో విడుదల కావాల్సిన వి సినిమా, ఏప్రిల్ లో లైన్ కట్టిన ఉప్పెన, నిశ్శబ్దం, రెడ్ సినిమాలకి ఓటిటి గాలం వెయ్యడం హీరోలు, దర్శకులు ఒప్పుకోకపోవడం జరిగింది. థియేటర్స్ లోనే మా సినిమా విడుదలవుతుంది అంటూ బింకానికి పోయారు. మీడియం రేంజ్ సినిమాలు అలాగే క్రేజ్ ఉన్న సినిమాలు కాబట్టి ఓటిటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ వారు భారీ ఆఫర్స్ ఇచ్చిన ఎవరూ ముందుకు రాలేదు. మరి మూడు నెలల నుండి సినిమా లని ఎప్పుడు విడుదల చెయ్యాలో తెలియక తికమకపడుతున్న దర్శకనిర్మాతలకు మళ్ళీ ఓటిటి నుండి కబురు వచ్చిందట. వి కోసం దిల్ రాజుకి, రెడ్ కోసం రామ్ కి, నిశ్శబ్దం కోసం కోన కి ఇలా ఓటిటి తో స్ట్రీమింగ్ అమెజాన్ వారితో పాటుగా టాలీవుడ్ ఆహా కూడా పోటీకి వెళుతుందట.

ఇంతకుముందు ఓటిటి లలో విడుదలయిన చాల సినిమాలు నిరాశ పరచడంతో.. ప్రేక్షకులకు ఓటిటి ల మీద నమ్మకం తగ్గకుండా ఇప్పుడు మీడియం రేంజ్, క్రేజ్ ఉన్న సినిమాలను ఓటిటి లో విడుదల చేసి హిట్ కొట్టాలని చూస్తున్నారు ఓటిటి యాజమాన్యాలు. అందుకే మళ్ళీ నిర్మాతలకు భారీ గాలం వెయ్యడానికి ఓటిటి సంస్థలు రెడీ అయ్యారు. అయితే వి సినిమాకి ఇంతకుముందు ఇచ్చిన ఆఫర్ కన్నా కాస్త పెంచినట్టుగా తెలుస్తుంది. మరోపక్క బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలే ఓటిటి లకు క్యూ కడుతుంటే.. తెలుగు హీరోలు మాత్రం బెట్టు చెయ్యడమెందుకు.. తలొగ్గితే పోదూ అంటున్నారు. మరి మరో రెండు నెలలు థియేటర్స్ తేర్చుకోకపోతే చచ్చినట్టుగా హీరోలు, దర్శకులు తమ సినిమాలను ఓటిటి లలోనే విడుదల చేస్తారు లే అంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News