ఓటిటి ఊపిరి పీల్చుకో!!

కరోనా తో థియేటర్స్ బంద్ కాకముందు ఓటిటి అంటే.. ఆహా ఓహో.. అన్నంత కాకపోయినా…. దానికి మంచి ఆదరణే ఉండేది. కానీ కరోనా ఎప్పుడైతే వచ్చి థియేటర్స్ [more]

Update: 2020-11-13 12:49 GMT

కరోనా తో థియేటర్స్ బంద్ కాకముందు ఓటిటి అంటే.. ఆహా ఓహో.. అన్నంత కాకపోయినా…. దానికి మంచి ఆదరణే ఉండేది. కానీ కరోనా ఎప్పుడైతే వచ్చి థియేటర్స్ మూతపడ్డాయో… ఓటిటి ల పంట పండింది. ఒక్కసారిగా క్రేజ్ ని సంపాదించేసాయి. క్రేజ్ ఉన్న సినిమాలకు థియేట్రికల్ రైట్స్ కి ఎంతొస్తుందో అంత ధర పెట్టి కొనేసి డైరెక్ట్ ఓటైటిలలో విడుదల చేస్తున్నాయి. పెద్ద హీరోలకు గళం వేసినా వాళ్ళు ఒంగలేదు కానీ… మీడియం రేంజ్ హీరోలు ఓటిటి ఆఫర్స్ కి తలొగ్గారు. తమిళనాడులో అయితే థియేట్రికల్ సంఘాల బెదిరించినా.. ఒత్తిళ్లు తెచ్చినా… తలొగ్గకుండా హీరో సూర్య తన భార్య సినిమాలను, తన సినిమాలను ఓటిటీలకు అమ్మేశాడు. అలాగే నాని, అనుష్క, చిన్న హీరోలంతా ఓటిటి బాట పట్టారు.

మార్చ్ నుండి ఓటిటీల నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ సో సో అనే టాక్ తోనే నడుస్తున్నాయి. కానీ తాజాగా విడుదలైన సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాతో ఓటిటీలు ఊపిరి పీల్చుకున్నాయి. పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రెస్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కొన్న వి, నిశ్శబ్దం, పెంగ్విన్ సినిమాలకు హిట్ టాక్ రాలేదు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సూర్య ఆకాశం నీ హద్దురా కి సూపర్ డూపర్ హిట్ టాక్ రావడమే కాదు.. హిట్ రివ్యూస్ రావడంతో.. అమెజాన్ కి గట్టి బ్లాక్ బస్టర్ పడింది. దానితో ఓటీటీలు ఊపిరి పీల్చుకున్నాయి. థియేటర్స్ ఓపెన్ అయ్యే టైం లో సూర్య సినిమా అమెజాన్ లో విడుదల చెయ్యడం సాహసం అయినప్పటికీ… ఎప్పుడో కుదిరిన డీల్ కాబట్టి.. అందులోనూ సూర్య తన సినిమాల విషయంలో ఓ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. ఆకాశం నీ హద్దురా సినిమాతో అమెజాన్ మాత్రమే హిట్ కొట్టలేదు.. చాలా ఏళ్లుగా హిట్ చూడని సూర్య కూడా ఆకాశం నీ హద్దురా సినిమాతో భారీ హిట్ కొట్టేసాడు.

Tags:    

Similar News