థియేటర్స్ ఓపెన్.. ఓటిటీలు క్లోజ్

కరోనా క్రైసిస్ ఎవరికెన్ని నష్టాలూ తెచ్చిందో, ఎవరికీ ఎన్ని లాభాలు తెచ్చిందో పక్కా క్లారిటీ లేదు కానీ.. ఓటిటి సంస్థలు మాత్రం లాభాల బాట పట్టాయి. కరొనకి [more]

Update: 2021-01-23 03:17 GMT

కరోనా క్రైసిస్ ఎవరికెన్ని నష్టాలూ తెచ్చిందో, ఎవరికీ ఎన్ని లాభాలు తెచ్చిందో పక్కా క్లారిటీ లేదు కానీ.. ఓటిటి సంస్థలు మాత్రం లాభాల బాట పట్టాయి. కరొనకి ముందు ఓటిటి, కరోనా తర్వాత ఓటిటి అన్నట్టుగా ఉంది ఓటిటీల రేంజ్. కరోనాకి ముందు సినిమా విడువులైన రెండు నెలలకి ఓటిటికి వచ్చి చేరితే.. కరోనా తర్వాత సినిమా నేరుగా ఓటిటి నుండే రిలీజ్ అయ్యింది. కరోనాకు ముందు వెబ్ సీరీస్ లంటూ ఓటిటిలు సరిపెట్టుకుంటే.. కరోనా తర్వాత సినిమాలను నేరుగా రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసాయి. వారానికో సినిమా కాకపోయినా నెలకో రెండు మూడు సినిమాలు ఓటిటి నుండి రిలీజ్ అయ్యేవి. దానితో వాటి వ్యూవర్ షిప్ బాగా పెరిగింది. అయితే గత నెలలో థియేటర్స్ ఓపెన్ కావడం సినిమా హీరోలంతా కేంద్రం చెప్పిన 50 పర్సెంట్ అక్యుపెన్సీకి కట్టుబడి థియేటర్స్ లోనే సినిమాల విడుదలకు మొగ్గు చూపుతున్నారు.

గత నెలలో సోలో బ్రతుకే సో బెటర్ థియేటర్స్ లో రిలీజ్ అయితే ఈ నెలలో క్రాక్, రెడ్, మాస్టర్, అల్లుడు అదుర్స్, రేపటినుండి కొత్త సినిమాల రిలీజ్ లతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. థియేటర్స్ లో బొమ్మ పడితే చూసి ఎంజాయ్ చేసే సినిమా లవర్స్ చాలామంది ఉన్నారు. దానితో ఓటిటీల గిరాకీ తగ్గింది. థియేటర్స్ ఓపెన్ కాకముందు కమిట్ అయిన హీరోలు తప్ప ఇప్పుడు ఏ హీరోని కదిపినా థియేటర్స్ లోనే మా మూవీ అంటూ ఓటిటికి మొండి చెయ్యి చూపిస్తున్నారు. థియేటర్స్ హవా మొదలు కావడంతో ఇప్పుడు ఓటిటీలు ఉసూరుమంటున్నాయి. లేదంటే ఆ సినిమా అమెజాన్ ప్రైమ్ వారు అంతకు కొన్నారట, ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు ఎగరేసుకుపోయింది అంటూ సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు వండి వార్చేవారు. కానీ ఇప్పుడు ఆ సినిమాకి థియేట్రికల్ రైట్స్ అంతకు అమ్ముడు పోయాయి. ఇంతకి అమ్ముడు పోయాయి అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇక ఓటిటీలు మళ్ళీ వెబ్ సీరీస్ లతో హడావిడి చేసుకోవాల్సి వచ్చేలా ఉంది.

Tags:    

Similar News