స్టార్ హీరోలైతేనే… లేదంటే..!!

ప్రస్తుతం టాలీవుడ్ లో పూజ హెగ్డే – రశ్మికలు నువ్వా నేనా అన్న రేంజ్ లో దూసుకుపోతున్నారు. ఎవరైన హీరో సినిమా మొదలెడితే పూజ హెగ్డే నా, [more]

Update: 2020-06-30 06:48 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో పూజ హెగ్డే – రశ్మికలు నువ్వా నేనా అన్న రేంజ్ లో దూసుకుపోతున్నారు. ఎవరైన హీరో సినిమా మొదలెడితే పూజ హెగ్డే నా, రశ్మికనా అని ఆలోచించే స్థితిలో ఈ ఇద్దరు భామలు ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ తో రష్మిక – అల్లు అర్జున్ తో పూజ హెగ్డే జత కట్టారు. అలాగే పూజ హెగ్డే ప్రభాస్ తో రాధేశ్యాం అంటూ పాన్ ఇండియా మూవీలో నటిస్తుంటే.. రష్మిక అల్లు అర్జున్ తో పుష్ప సినిమాతో పాన్ ఇండియా మూవీ చేయబోతుంది. అయితే రష్మిక ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్. అలాగే పూజ హేగ్డ్ కూడా అంతే. ప్రస్తుతం వీళ్ళ చేతుల్లో రెండు మూడు సినిమాలున్నాయి. అయితే పూజ హెగ్డే మాత్రం యంగ్ హీరోలైన, స్టార్ హీరోలైన తన పాత్రకి ప్రధాన్యత ఉంటె ఒప్పేసుకుంటుంది.

కానీ రష్మిక ఆలా కాదు…. తనకి స్టార్ హీరోల ఛాన్స్ అయితేనే తన దగ్గరకి తెమ్మని తన మేనేజర్ కి చెబుతుందట. ప్రస్తుతం లెవల్ మారింది.. అందుకే ఇద్దరు హీరోయిన్స్ ఆఫర్ అయినా.. చిన్న హీరోల ఆఫర్ అయినా తన దగ్గరదాకా తేవొద్దని, కేవలం స్టార్ ఛాన్స్ ఉంటె రమ్మని చెబుతున్నదట. ఇంతకుముందు నాని శ్యాం సింగరాయ సినిమాలో రశ్మికకి సెకండ్ హీరోయిన్ పాత్రని రిజెక్ట్ చేసింది అని న్యూస్ విషయంలోనే రష్మిక ఇలా మార్గదర్శకాలు పాస్ చేసిందట. ఇలాంటి వార్తల వలన తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది.. అందుకే అలాంటి ఆఫర్ విషయంలో తనదాకా తేవొద్దని తన మేనేజర్ కి స్ట్రిట్ గా ఆర్డర్స్ పాస్ చేసిందట.

Tags:    

Similar News