ఈ నటుడు ఇక నెగెటివ్ కేరెక్టర్స్ కే సరి!!

హీరోగా కెరీర్ ఆరంభించిన నవీన్ చంద్ర ఇప్పుడు నెగెటివ్ కేరెక్టర్స్ కి కేరాఫ్ గా మారాడు. అరవింద సమేత, తమిళంలో ధనుష్ లోకల్ బాయ్ సినిమాల్లో విలన్ [more]

Update: 2020-06-17 08:51 GMT

హీరోగా కెరీర్ ఆరంభించిన నవీన్ చంద్ర ఇప్పుడు నెగెటివ్ కేరెక్టర్స్ కి కేరాఫ్ గా మారాడు. అరవింద సమేత, తమిళంలో ధనుష్ లోకల్ బాయ్ సినిమాల్లో విలన్ కేరెక్టర్స్ తో నవీన్ చంద్ర క్రేజ్ సంపాదించాడు. హీరోగా ట్రై చేస్తూనే వచ్చిన విలన్ కేరెక్టర్స్ తోనూ సత్తా చాటుతున్నాడు. అయితే ఇప్పుడు నవీన్ చంద్రకి మరో భారీ ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చింది అని అంటున్నారు. అది కూడా పవర్ ఫుల్ విలన్స్ కేరెక్టర్స్ సిద్ధం చేసే బోయపాటి సినిమాల. బాలకృష్ణ – బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న BB3 లో నవీన్ చంద్ర ఓ కీలక పాత్ర చేయబోతున్నాడనే టాక్ వినబడుతుంది.

మరి బోయపాటి శ్రీను సరైనోడు లో హీరో ఆది కి పవర్ ఫుల్ విలన్ కేరెక్టర్ తో పైకి లేపినట్టుగా జగపతి బాబు ని విలన్ గా క్రేజీ స్టార్ గా నిలబెట్టినట్టుగా ఇప్పుడు బోయపాటి నవీన్ చంద్ర ని ఈ సినిమాతో విలన్ గా పది మెట్లు ఎక్కించడం ఖాయం. అరవింద సమేతలో, లోకల్ బాయ్ లో చిన్న నెగెటివ్ కేరెక్టర్స్ లోనే సరిపెట్టుకున్న నవీన్ చంద్ర కి ఇప్పుడు బాలయ్య సినిమాలో విలన్ గా కీలక పాత్ర అంటే నవీన్ చంద్ర కెరీర్ టర్న్ అవడం ఖాయం.

Tags:    

Similar News