దిల్ రాజే కాపాడాలి

Update: 2018-06-03 06:35 GMT

మొదట పర్లేదు అనిపించుకున్న హీరో రాజ్ తరుణ్ గత కొంత కాలం నుండి అన్ని నాసి రకం సినిమాలు చేస్తున్నాడు. చాలా మంది యువ హీరోస్ లాగా కెరియర్‌ ఎలా మలచుకోవాలనేది తెలియలేదు. కథకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వేరే వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి పెద్ద నిర్మాణ సంస్థలకి వరసగా సినిమాలు చేస్తూ తన కెరియర్‌ ను చేతులారా పాడుచేసుకున్నాడు.

రాజ్ తరుణ్ గత చిత్రం 'రంగుల రాట్నం' సంక్రాంతికి విడుదలై ఫ్లాప్‌ అయింది. దాంతో తన తర్వాత సినిమాపై అంత హోప్స్ పెట్టుకున్నారు. 'రాజుగాడు' ట్రైలర్ చూస్తే ఇది పక్క హిట్ అవ్వుతుంది అనే అంచనాలు కూడా వేసుకున్నారు చాలా మంది. అయితే ఈ శుక్రవారం విడుదలై ఈ సినిమా మినిమమ్‌ వసూళ్లు తెచ్చుకోలేకపోతోంది.

మొన్నటి వరకు హీరో రాజ్ తరుణ్ మినిమం గ్యారెంటీ హీరోగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు అతని సినిమాకి ఇరవై శాతం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ప్రస్తుతం రాజ్ తరుణ్ కి బ్యాడ్ లక్ బాగా రన్ అవుతుంది. అయితే దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ వి రెండు సినిమాలు ఉన్నాయి కనుక రాజ్‌ తరుణ్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చే అవకాశాలైతే లేకపోలేదు. రాజ్ తరుణ్ ని దిల్ రాజే కాపాడాలి..

Similar News