ఏడాది బ్రేక్ తప్పేలా లేదుగా అనిల్!!

ఈ ఏడాది మహేష్ బాబుతో అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ సినిమా చేసి హిట్ కొట్టాడు. బ్లాక్ బస్టర్ అనలేము కానీ.. అలా వైకుంఠపురములో ముందు సరిలేరు [more]

Update: 2020-06-03 05:06 GMT

ఈ ఏడాది మహేష్ బాబుతో అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ సినిమా చేసి హిట్ కొట్టాడు. బ్లాక్ బస్టర్ అనలేము కానీ.. అలా వైకుంఠపురములో ముందు సరిలేరు నీకెవ్వరూ ఓడిపోయినట్లే. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ పరశురామ్ తో సర్కారు వారి పాట మొదలెట్టేడు. కానీ అనిల్ రావిపూడి మాత్రం ఎఫ్ 3 స్క్రిప్ట్ మీదే కూర్చున్నాడు. అయితే ఇటు వెంకీ కానీ, అటు వరుణ్ కానీ అనిల్ కి డేట్స్ ఇవ్వలేదు. ఈలోపు అనిల్ రావిపూడి బాలయ్య కోసం కథ మొదలెట్టాడు అనే టాక్ ఉండడమే కాదు.. బాలయ్య కథ కూడా పూర్తి చేసాడనే టాక్ ఉంది. అయితే ఈ ఏడాదే ఎఫ్ త్రీ తో అనిల్ సెట్స్ మీదకెళ్తాడని అన్నారు. కానీ తాజాగా అనిల్ రావిపూడి ఈఏడాది గ్యాప్ రావడం పక్కా అంటున్నారు.

కారణం వెంకటేష్ నారప్ప షూట్ తో బిజీ. అసలే కరోనా లాక్ డౌన్ షూటింగ్ కి బ్రేక్ వెయ్యడం, మరోపక్క అన్న కొడుకు రానా పెళ్లి కుదరడం. ఇంట్లో పెళ్లి అంటే రానా బాబాయ్ గా వేంకటేష్  కి చాలా పనులుంటాయి. అందుకే అనిల్ రావిపూడి తో వెంకటేష్ ఎఫ్ త్రీ ఇప్పుడు కాదమ్మా వహ్చే ఏడాది చూసుకుందామని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఆగష్టు లో రానా పెళ్లి అంటే ఈ రెండు నెలలు రానా పెళ్లి పనుల్లతో బిజీగా నారప్ప షూటింగ్ కి కూడా భారీగా బ్రేక్ వచ్చిన రావొచ్చు. మరోపక్క వరుణ్ తేజ్ రెండు సినిమాల్తో బిజీ. మరోపక్క బాలకృష్ణ బోయపాటి తో సినిమా చెయ్యాలి. అది వర్కౌట్ అయ్యేలా లేదు. సో అనిల్ కి వచ్చే ఏడాది మార్చ్, ఏప్రిల్ వరకు హీరోలెవరు డేట్స్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. పాపం పెద్ద స్టార్ తో సినిమా చేసినా.. ఏడాది గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది.

Tags:    

Similar News