మళ్లీ న్యూస్ లో ఓంకార్ రాజు గారి గది..!

యాంకర్ కం డాక్టర్ కం డైరెక్టర్ ఓంకార్ రాజు గారి గది 1, 2 అనే కామెడీ హర్రర్ మూవీస్ తో మెప్పించాడు. రాజు గారి గది [more]

Update: 2019-03-09 03:56 GMT

యాంకర్ కం డాక్టర్ కం డైరెక్టర్ ఓంకార్ రాజు గారి గది 1, 2 అనే కామెడీ హర్రర్ మూవీస్ తో మెప్పించాడు. రాజు గారి గది మొదటి పార్ట్ లో పెద్దగా క్రేజ్ ఉన్న స్టార్స్ ని తీసుకోకుండా మామూలు ఆర్టిస్ట్ లతో కామెడీ పండించి హిట్ కొట్టాడు ఓంకార్. ఇక రెండో పార్ట్ రాజు గారి గది 2లో నాగార్జున, సమంత లాంటి క్రేజ్ ఉన్న స్టార్స్ ని పెట్టి హిట్ కొట్టాడు. నాగార్జున మెంటలిస్ట్ గా, సమంత దెయ్యంగా తెరకెక్కిన రాజు గారి గది 2 సినిమా హిట్ అయ్యాక ఓంకార్ మరో సినిమాని అనౌన్స్ చెయ్యలేదు. రాజుగారి గది 2 తర్వాత ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలతో ఓంకార్ సినిమా అన్నారు కానీ.. అదేం లేదు. ఇక ఓంకార్ బుల్లితెర మీద జేడ్జ్ గా కనిపిస్తున్నాడు కానీ.. తన తదుపరి చిత్రమై ఎలాంటి న్యూస్ మీడియాలో మాత్రం వినబడడం లేదు.

ఇప్పుడు రాజు గారి గ‌ది 3

తాజాగా రాజు గారి గది 3కి ఓం కార్ శ్రీకారం చుడుతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వినబడుతుంది. ఇప్పటికే రాజు గారి గది 3కి సంబందించిన కథ పూర్తి చెయ్యడమే కాదు.. స్క్రిప్ట్ కూడా లాక్ చేసిన ఓంకార్ ఈసారి తన సినిమాలో మిల్కి బ్యూటీ తమన్నాని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇక తమన్నా కోసం ఓం కార్ ముంబై వెళ్లి ఆమెని కలిసి రాజు గారి కథ 3ని వినిపించాడట. అయితే తమన్నా మొదట ఆలోచించిన తరవాత ఎన్నడూ ఇలాంటి హర్రర్ కామెడీ ల్లో నటించలేదు కాబట్టి…. ఓంకార్ కి ఓకే చెప్పినట్లుగా వార్తలు జోరందుకున్నాయి. మరి రాజుగారి గది సీక్వెల్స్ తో ఓం కార్ వరసగా సినిమా లు తీస్తూ హిట్స్ కొట్టేస్తాడన్నమాట.

Tags:    

Similar News