నాగ శౌర్య కి మంచి ఆఫర్ వచ్చింది..!

Update: 2018-12-08 08:02 GMT

క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం మహేష్ బాబు సినిమా కోసం స్టోరీని అల్లే పనిలో ఉన్నాడు. మహేష్ ప్రస్తుతం 'మహర్షి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే వెంటనే టైం గ్యాప్ తీసుకోకుండా సుకుమార్ తో సినిమా చేస్తాడు. సుకుమార్ ఒక పక్క సినిమాలను డైరెక్ట్ చేస్తూనే.. మరోపక్క తన బ్యానర్ లో సినిమాలని నిర్మిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ అనే సొంత బ్యానర్ లో రాజ్ తరుణ్ ని హీరోగా పెట్టి 'కుమారి 21 F' సినిమాను నిర్మించాడు. ఈ సినిమాకు కథ సుకుమారే అందించాడు.

సుకుమార్ పై నమ్మకంతో...

ఇప్పుడు తన మరో అసిస్టెంట్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ రాసిన ఒక కథతో తన అసిస్టెంట్ తో సినిమాని డైరెక్ట్ చేయించబోతున్నాడు అంట. అయితే ఆ సినిమాలో నాగ శౌర్య నటించే ఛాన్స్ కొట్టేసాడు. హీరో నాగ శౌర్య సినిమా కథ మొత్తం పూర్తి అవ్వకుండానే సుకుమార్ మీద నమ్మకం, తన స్టోరీల మీద కాంఫిడెన్స్ తో ఏమీ ఆలోచించకుండా ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నాగ శౌర్య ప్రస్తుతం సమంతా లీడ్ రోల్ లో వస్తున్న ఒక సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే సుకుమార్ బ్యానర్ లో నాగ శౌర్య సినిమా వివరాలను అధికారంగా ప్రకటించనున్నారు.

Similar News