‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కు భారీ ఆఫర్.. కానీ..!

రామ్ తొలిసారిగా పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రామ్ తెలంగాణ కుర్రోడిగా నటించబోతున్నాడు. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై [more]

Update: 2019-05-12 07:43 GMT

రామ్ తొలిసారిగా పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రామ్ తెలంగాణ కుర్రోడిగా నటించబోతున్నాడు. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచుకున్న ఈ సినిమా రైట్స్ సొంతం చేసుకునేందుకు ఓ ప్రముఖ సంస్థ ముందుకొచ్చినట్టు టాక్. మొత్తంగా ఆ సంస్థ రూ.20 కోట్లకు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. డీల్ ఓకే అయితే ముందుగా 10 కోట్లు రిలీజ్ కి ముందు మరో 10 కోట్లు ఇస్తాం అని ఆ సంస్థ చేప్పిందట.

ఇంకా డిమాండ్ పెరుగుతుందని

పరిస్థితి గమనించిన ఛార్మి.. టీజర్‌, ట్రైలర్‌ విడుదలైతే ఇస్మార్ట్ రేటు మరింత పెరుగుతుందని ఆలోచన చేసిందట. దాంతో అలా ఆ ఆఫర్ మిస్ అయినట్టు తెలుస్తుంది. మరి ఈసారి ‘ఇస్మార్ట్’ని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. ముందుగా ఈ సినిమా మేలో రిలీజ్ చేద్దాం అని ప్లాన్ చేసుకున్నారు. అయితే హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ పాస్‌పోర్ట్ పోవ‌డంతో షూటింగ్ డిలే అయ్యింది. షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.

Tags:    

Similar News