ఎన్టీఆర్ – త్రివిక్రమ్ అన్ని సిద్ధం?

కరోనా కారణం హీరోల షూటింగ్ ప్లాన్స్ అన్ని కొలాప్స్ అయ్యాయి. లేదంటే హీరోలంతా సినిమా షూటింగ్స్ లో మంచి హడావిడిగా ఉండాల్సిన టైం ఇది. అలాగే చాలామంది [more]

Update: 2020-10-02 18:29 GMT

కరోనా కారణం హీరోల షూటింగ్ ప్లాన్స్ అన్ని కొలాప్స్ అయ్యాయి. లేదంటే హీరోలంతా సినిమా షూటింగ్స్ లో మంచి హడావిడిగా ఉండాల్సిన టైం ఇది. అలాగే చాలామంది దర్శకనిర్మాతలు దసరాకి సినిమా రిలీజ్ విషయంలో, పబ్లసిటీ విషయంలో యమా బిజీగా ఉండేవారు. కానీ ఈ దసరాకి థియేటర్స్ తెరుచుకున్నా పెద్ద సందడి కనబడకపోవచ్చు. ఇక తాజాగా ఒక్కొక్క హీరో కరోనా పరిస్థితులని ఎదురించి షూటింగ్స్ కి బయలుదేరుతున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR షూటింగ్ లో రామ్ చరణ్ కన్నా ముందు ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడట. రాజమౌళి సినిమాతో పాటుగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ కూడా చెయ్యాల్సి ఉంది.

ఎన్టీఆర్ RRR మూవీలో నటించడం, తివిక్రమ్ కి అలా వైకుంఠపురములో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఉండడంతో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాపై భీబత్సమైన అంచనాలున్నాయి. అయితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసి ఎన్టీఆర్ కి వినిపించాడని.. ఎన్టీఆర్ కూడా స్వామి చెప్పేదానికి ఎలాంటి మార్పులు చెప్పలేదని తెలుస్తుంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ ని ప్రేమగా స్వామి అని పిలుచుకుంటాడు. అయితే ఎన్టీఆర్ RRR తో పాటుగా త్రివిక్రమ్ మూవీ కూడా స్టార్ట్ చేస్తాడో లేదంటే RRR అయ్యాకే త్రివిక్రమ్ మూవీ అంటాడో కానీ.. త్రివిక్రమ్ మాత్రం ఎన్టీఆర్ సినిమా కోసం హీరోయిన్ ని మిగతా స్టార్ కాస్ట్ ని వెతికే పనిలో ఉన్నాడని అంటున్నారు.

Tags:    

Similar News