ఎన్టీఆర్ ఓకే... మరి త్రివిక్రమ్ సంగతేంటి..?

Update: 2018-10-10 06:42 GMT

ఎన్టీఆర్ పన్నెండేళ్ల కల తీరిపోయింది. త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకుని పన్నెండేళ్లు అయ్యిందని ఎన్టీఆర్ స్వయంగా చెప్పాడు. మరి వారి కలయికలో రాబోతున్న అరవింద సమేత వీరరాఘవ షూటింగ్ ఆఘమేఘాల మీద పూర్తి కావడం.. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చెయ్యబోతుంది. ఇక ఎన్టీఆర్ కల నిజమవడానికి కొద్ది గంటల టైం మాత్రమే ఉంది. ఇకపోతే అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో #RRR కోసం రేడిగా ఉంటాడు. తండ్రి మరణం నుండి కోలుకుని అరవింద షూటింగ్ చేసిన ఎన్టీఆర్ ఈ సినిమా విడుదలయ్యాక కాస్త రెస్ట్ తీసుకోబోతున్నాడనేది తెలిసిన విషయమే. ఇక ఎన్టీఆర్ ఒక నెల రెస్ట్ తీసుకుని రాజమౌళి సినిమా కోసం డిసెంబర్ కల్లా రెడీ అవుతాడట. అయితే ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కోసం రాజమౌళి ఒక వర్క్ షాప్ నిర్వహించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.

అరవింద హిట్ అయితే చాలు...

కానీ అరవింద దర్శకుడు త్రివిక్రమ్ సంగతేమిటి ? అజ్ఞాతవాసి తర్వాత ఎన్టీఆర్ అరవిందతో వస్తున్నప్పటికీ... త్రివిక్రమ్ మీద ప్రస్తుత హీరోలెవరికీ నమ్మకమే లేదు. అరవింద సమేత హిట్ పడితే త్రివిక్రమ్ కోసం అల్లు అర్జున్ కాచుకుని కూర్చున్నాడు. అరవింద హిట్ అవడం పాపం.. త్రివిక్రమ్ దగ్గర వాలిపోవడానికి వెయిట్ చేస్తున్నాడు. ఇక త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా తర్వాత ఏ హీరోకి కమిట్ అవ్వలేదని.. వెంకటేష్ తో సినిమా సెట్ అయినా.. కథ ఫైనల్ కాలేదని.. అల్లు అర్జున్ తో ఏం అనుకోలేదని చెబుతున్నాడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ అరవింద సమేత ప్రమోషన్స్ లో భాగంగా త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమా ఫిక్స్ కాలేదని చెప్పాడు. అలాగే మహేష్ తో సినిమాపై కూడా త్రివిక్రమ్ స్పందించాడు. ఎన్టీఆర్ తో ఎలా 12 ఏళ్ల నుండి సినిమా అని ఎలా అనుకుంటున్నానో.. మహేష్ తో సినిమా గురించి అలానే అనుకున్నాను. ఇక ఎన్టీఆర్ తో ఇప్పటికి కుదిరింది. ఇక మహేష్ తో ఎప్పటికి కుదురుందో అంటూ చెబుతున్నాడు. మరి అరవింద తర్వాత ఎన్టీఆర్ ఓకె.. కానీ త్రివిక్రమ్ సంగతేమిటో.. అనేది తెలియాల్సిన విషయమే. ఏదైనా అరవింద సమేతే డిసైడ్ చేస్తుందిలే.

Similar News