ఎన్టీఆర్ తో పాన్ ఇండియా అంటాడా?

దసరా రోజున నిర్మాతలు తమ కొత్త సినిమాల పోస్టర్స్ తో హడావిడి చేస్తే.. హీరోలంతా ఆపోస్టర్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి పిచ్చెక్కించారు. అయితే ఎన్టీఆర్ [more]

Update: 2020-10-26 06:27 GMT

దసరా రోజున నిర్మాతలు తమ కొత్త సినిమాల పోస్టర్స్ తో హడావిడి చేస్తే.. హీరోలంతా ఆపోస్టర్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి పిచ్చెక్కించారు. అయితే ఎన్టీఆర్ స్పెషల్ వీడియో ని దసరా కన్నా ముందే వదిలిన RRR టీం ఎన్టీఆర్ ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చేసింది. ఫాన్స్ కూడా దిల్ ఖుష్. అయితే ఎన్టీఆర్ ఫాన్స్ మరో హ్యాపీ అప్ డేట్ కోసం ఎదురు చూసారు. అది త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చెయ్యబోయే సినిమా అప్ డేట్ ఏమైనా ఉంటుందేమో అని ఆశపడ్డారు కానీ.. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ హ్యాండ్ ఇచ్చేసారు. అయితే ఎన్టీఆర్ తో జస్ట్ సినిమా అనౌన్సమెంట్ తప్ప కనీసం షూటింగ్ కూడా మొదలు కానీ సినిమాకి అప్ డేట్ ఇవ్వాలంటే ఏ హీరోయిన్ పేరో.. లేదంటే ఏ టైటిల్ ఓ ప్రకటిస్తే ఖుష్ అయ్యేవారు.

అయితే అసలు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియని సినేమానికి త్రివిక్రమ్ ఎలా టైటిల్ ఎనౌన్స్ చేస్తాడు. అలాగే ఇప్పటినుండే హీరోయిన్ పేరు చెప్పడమెందుకులే అని ఊరుకున్నారు. అయితే టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా జపం చేస్తుంటే.. దానికి తగ్గట్టుగా దర్శకులు కూడా పాన్ ఇండియా కథలతో హీరోలను పడేస్తున్నాడు. అందులో పూరి జగన్నాధ్, సుకుమార్, కొరటాల శివాలు ఉండగా.. త్రివిక్రమ్ మాత్రం పాన్ ఇండియా వైపు చూడడం లేదు. మరి ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి లాంగ్ గ్యాప్ వచ్చింది. ఎలాగూ ఎన్టీఆర్ RRR ఎప్పుడు ఫినిష్ చేస్తాడో తెలియదు.. ఈలోపు తన స్క్రిప్ట్ ని త్రివిక్రమ్ పాన్ ఇండియా స్క్రిప్ట్ గా మార్చేస్తే.. అబ్బ ఎన్టీఆర్ వరసబెట్టి పాన్ ఇండియా ఫిలిమ్స్ కి సెట్ అయిపోతాడు. ఇది ఎన్టీఆర్ ఫాన్స్ ఆశ.

కానీ త్రివిక్రమ్ ఏమంటాడో. అలా వైకుంఠపురములో హిట్ తర్వాత త్రివిక్రమ్ సినిమాపై భారీ అంచనాలుంటాయి. అందుకు తగ్గట్టుగా త్రివిక్రమ్ కథ, డైరెక్షన్ ఉండాలి. అంటే తదుపరి సినిమాపై ఒత్తిడి ఉంటుంది. అదే పాన్ ఇండియా అయితే మరింత టెంక్షన్ పడాలి. కాబట్టి కూల్ గా ఎన్టీఆర్ తో సౌత్ కే పరిమితమవుతాడా? లేదంటే రిస్క్ తీసుకుని ఎన్టీఆర్ తో పాన్ ఇండియా బోణి చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News