ఆమె రాకతో సెట్స్ కే కళ వచ్చిందట

Update: 2018-05-16 03:14 GMT

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొన్నటివరకు ఎన్టీఆర్ కు సంబంధించి సీన్స్ ను షూట్ చేశాడు త్రివిక్రమ్. రీసెంట్ గా ఈ సెట్స్ పైకి పూజా హెగ్డే జాయిన్ అయింది. తారక్ -పూజా పై కొన్ని సన్నివేశాలు తీశారు. ఈనెల 9న స్టార్ట్ అయిన ఈ షెడ్యూల్ మరో 10రోజుల పాటు కొనసాగుతుంది.

దీని తర్వాత జరిగే రెండు షెడ్యూల్స్ లో కూడా పూజా పాల్గొననుంది. అంటే బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో ఆమెకు సంబంధించిన సన్నివేశాలన్నీ పూర్తిచేయాలని నిర్ణయించారు. సో దీనిబట్టి ఆమెది చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. ప్రస్తుతం మన తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు ఆలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్రలు. కానీ పూజాది అటువంటి పాత్ర కాదని అర్ధం అవుతుంది.

మరోవైపు ఈ సినిమా సంగీత దర్శకుడు తమన్ ఆల్రెడీ రెండు ట్యూన్స్ ఇచ్చాడంట. ఆ ట్యూన్స్ త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ కి నచ్చడంతో మిగిలిన ట్యూన్స్ అందించే పనిలో ఉన్నాడంట. ఈ సినిమాను హారిక-హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Similar News