త్రివిక్రమ్ నువ్వు మారవా?

త్రివిక్రమ్ ఈమధ్యన వేరే సినిమా కథలను కాపీ చేసి.. నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు ఇది పచ్చి నిజం. త్రివిక్రమ్ ఒప్పుకోకపోయినా.. ఇదే నిజం, [more]

Update: 2020-03-06 07:08 GMT

త్రివిక్రమ్ ఈమధ్యన వేరే సినిమా కథలను కాపీ చేసి.. నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు ఇది పచ్చి నిజం. త్రివిక్రమ్ ఒప్పుకోకపోయినా.. ఇదే నిజం, అ… ఆ, అజ్ఞాతవాసి ఇలా చాలా సినిమాలు త్రివిక్రమ్ ఏ పాత సినిమాలో, లేదంటే ఏ ఫ్రెంచ్ సినెమానో చూసి ఇన్స్పిరె అయినవే. మరి తాజాగా ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చెయ్యబోయే సినిమా మాత్రం ఫ్రెష్, త్రివిక్రమ్ పెన్ను నుండి జాలువారిన కథ అంటూ చాలా ప్రచారం జరిగింది. కానీ తాజాగా త్రివిక్రమ్ ఏం మారలేదు.. మళ్ళీ ఓ పాత సినిమాని తగిలించుకుని.. కొత్తగా ఎన్టీఆర్ తో సినిమాకి ప్లాన్ చేస్తున్నాడనే టాక్ టాలీవుడ్ లోమొదలయ్యింది.

చిరు గతంలో అంటే కెరీర్ తొలినాళ్లలో బాపు డైరెక్షన్ నటించిన మంత్రిగారి వియ్యంకుడు సినిమాని నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్చి కథని సిద్ధం చేస్తున్నాడనే టాక్ వినబడుతుంది. చిరు నటించిన ఆ చిత్రం సూపర్ హిట్. కమర్షియల్ గా బాగా వర్కౌట్ అయిన ఆ సినిమాని ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ వాడేస్తున్నడంటున్నారు. అయితే ఆ సినిమా నుండి త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం కథ తీసుకోలేదని… ఎన్టీఆర్ తన అభిమానుల మెచ్చేలా మాస్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడానికి త్రివిక్రమ్ ఇప్పటికే స్క్రిప్ట్‌ను లాక్ చేసినట్లు చెబుతున్నారు. అయినను పోయి రావాలే హస్తినాకు అనే టైటిల్ పెడుతున్నారని.. కాబట్టే చిరు మంత్రిగారి వియ్యంకుడు సినిమా కథకు ఈ కథకు లింక్ పెట్టరంటున్నారు. అయితే అందులో నిజంలేదని.. త్రివిక్రమ్ పూర్తి కథతోనే ఎన్టీఆర్ ని ఒప్పించి సినిమా ప్రకటన ఇప్పించాడని ఇన్సైడ్ టాక్.

Tags:    

Similar News