ఎన్టీఆర్ టీమ్ ని కంగారు పెడుతున్నవి ఇవే..!

రేపు ఈ టైంకి ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అవ్వబోతుంది. ఎన్టీఆర్ జీవిత కథ కాబట్టి అందరికీ ఈ సినిమా చూడాలని కుతూహలం [more]

Update: 2019-01-08 07:07 GMT

రేపు ఈ టైంకి ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అవ్వబోతుంది. ఎన్టీఆర్ జీవిత కథ కాబట్టి అందరికీ ఈ సినిమా చూడాలని కుతూహలం ఏర్పడింది. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విభజించడం చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ నట జీవితం వడ్డించిన విస్తరి కావడంతో అక్కడ ఎత్తుపల్లాలు ఏమీ ఉండవు. ఎన్టీఆర్ జీవితంలో ఎత్తుపల్లాలు ఏమైనా ఉన్నాయంటే అది ఆయన రాజకీయ జీవితంలోనే. ఎన్టీఆర్ కథానాయకుడులో తన భార్యతో ఉన్న అనుబంధం, పలు గెటప్స్‌ చూసుకుని ఆనందం పడటం తప్ప వేరే ఏమీ ఉండదనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.

ఫ్యాన్స్ కి సరే… మామూలు ప్రేక్షకులు..?

అరవై గెటప్పులు.. పలు చిత్రాల్లోని పాటలు, సీన్ల క్లిప్పింగ్స్‌ వరకు చూపిస్తే ఫ్యాన్స్ కు పండగగా ఉంటుంది కానీ మిగిలిన ప్రేక్షకులు నిరాశ పడే అవకాశం లేకపోలేదు. మరి డైరెక్టర్ క్రిష్ ఎంతవరకు ఆ బోర్ లేకుండా తీశారనేది చూడాలి. విడుదలకి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉండటంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఒకవేళ ఎన్టీఆర్ మహానాయకుడులో నిజాలని చూపించకపోయినా ప్రేక్షకులు ఆ సినిమాను అంగీకరించే అవకాశం లేదు. దీంతో ఈ రెండు పార్టులు ఎన్టీఆర్ టీంని కలవరపెడుతున్నాయి.

Tags:    

Similar News