ఈ ఫొటోలు చూస్తుంటే... సినిమా కచ్చితంగా సంక్రాంతికే..!

Update: 2018-07-11 07:03 GMT

దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకుడిగా కన్ఫర్మ్ అయ్యాడో లేదో... ఆ సినిమా పనులు మొదలు పెట్టేసాడు. మొన్నటివరకు ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా వున్న దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ని పట్టాలెక్కించెయ్యడమే కాదు.. సినిమా షూటింగ్ ని పరిగెత్తించేస్తున్నాడు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఇప్పటికే ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటుంది. బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషిస్తున్నాడు. ఎన్టీఆర్ నట జీవితానికి సంబంధించిన సీన్స్ ని దర్శకుడు క్రిష్ ప్రస్తుతానికి చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న సన్నివేశాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వేగంగా జరుగుతున్న షూటింగ్...

ఆ ఫొటోలలో బాలకృష్ణ పౌరాణిక గెటప్స్ కాస్ట్యూమ్స్ లో కనబడుతున్నాడు. మరి ఎన్టీఆర్ కృష్ణుడిగా, రాముడిగా వేసిన గెటప్స్ ఎలాంటివో... వాటికెంత పేరొచ్చిందో అందరికి తెలుసు. ఇప్పుడు బయటికొచ్చిన పిక్స్ లో బాలయ్య ఆ దేవుడి గెటప్ లో అదరగొడుతున్నాడు. మరి ఈ రకంగా షూటింగ్ ని క్రిష్ పరిగెత్తిస్తుంటే సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి రెడీ అవడం ఖాయమే. నిన్నమొన్నటివరకు ఎక్కడో ఉన్న అనుమానాన్ని ఇప్పుడు ఈ వర్కింగ్ పిక్స్ లీక్ కావడంతో పటాపంచలైపోయాయి. మరి ఈ రకంగా షూటింగ్ జరిపితే అనుకున్న టైం కే సినిమా థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. అందునా క్రిష్ సినిమా టేకింగ్ విధానం ఎంత ఫాస్ట్ గా ఉంటుందో తెలిసిందే.

భారీ తారాగణంతో...

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బయో పిక్ లోని ఒక స్పెషల్ సాంగ్ కి టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ డాన్స్ చేయనుందట. ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాల్లో ఐటమ్స్ సాంగ్స్ మంచి ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి. అలాగే మంచి హిట్స్ కూడా అయ్యాయి. అందుకే సినిమాలోని కీలక సన్నివేశంలో వచ్చే పాట కోసం రకుల్‌ ప్రీత్ సింగ్‌ని ఎన్టీఆర్ బయో పిక్ యూనిట్ అడిగినట్లుగా దానికి రకుల్ కూడా ఓకె చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అలాగే టాలీవుడ్ నుండి భారీ తారాగణం ఈ సినిమా లో భాగమవుతున్నారు. ఇప్పటికే విద్యాబాలన్, మోహన్‌ బాబు, రానా కన్ఫర్మ్ కాగా కీర్తి సురేష్.. సావిత్రి పాత్రలో, బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ చిన్న ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జోరుగా జరిగుతోంది.

Similar News