క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ

#RRR సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ ఎక్కడైనా కనబడ్డాడు అంటే చాలు.. ఆ పిక్ ని నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఎన్టీఆర్ [more]

Update: 2020-03-10 06:50 GMT

#RRR సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ ఎక్కడైనా కనబడ్డాడు అంటే చాలు.. ఆ పిక్ ని నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. రెండేళ్లదాకా తమ హీరో సినిమా రాదన్న బాధ ఉన్నప్పటికీ.. ఉన్న సంతోషాన్ని మాత్రం చక్కగా వాడుకుంటున్నారు. మొన్నటికి మొన్న చాలా బరువు తగ్గి సన్నగా మారిన ఎన్టీఆర్ షేర్వాణీ లుక్ సోషల్ మీడియాలో ఎలా వైరల్ అయ్యిందో తాజాగా యంగ్ టైగర్ ఎన్టిఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి హోలీని జరుపుకుంటు.. దానికి సంబందించితిన ఓ క్యూట్ ఫ్యామిలీ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. .దానితో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి ఫుల్ స్టాప్, కామా లేకుండా పోయింది. భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి హోలీ పండుగను జరుపుకునే పిక్ ని ఎన్‌టిఆర్ పోస్ట్ చేశారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అభిమానులు చాలా కాలం తరువాత ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోను చూడటంతో వారి ఆనందానికి అవధులు లేవు. వైట్ డ్రెస్ లో ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం హోలీ ఆడుతూ ఎంతో ఆనందంగా… ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు కనబడుతుంది. ఎన్టీఆర్ కొడుకులు అభయ్ రామ్ మరియు భార్గవ్ రామ్ ఇద్దరూ ఇక్కడ అందంగా కనబడుతున్నారు. ఇంతకుముందు ఎన్టీఆర్ తన చిన్న కొడుకు పుట్టిన సందర్భంగా… భార్గవ్ ఉయ్యాలలో వేసే వేడుకలో దిగిన ఫోటోను షేర్ చేసాడు. అది షేర్ చేసి చాలాకాలం అయ్యింది. ఇక ఎయిర్ పోర్ట్ లోనో… లేదంటే ఏదైనా వేడుకలోనో ఎన్టీఆర్ తో పాటుగా ప్రణతిని చూసిన అభిమానులకు ఆయన కొడుకులను చూసే అవకాశం మాత్రం ఇన్నాళ్ళకి వచ్చింది. దానితో వారు హోలీ పండగని మరింత బ్రైట్ గా చేసుకుంటున్నారు. ఇక RRR చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటుగా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. RRR ను చుట్టేసిన తరువాత.. తాత్కాలిక టైటిల్ అయినను పోయి రావలే హస్తినకు పేరుతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ఎన్‌టిఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేతులు కలిపాడు.

Tags:    

Similar News