ఎన్టీఆర్ #RRR లుక్

Update: 2018-12-03 05:11 GMT

దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RRR చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నవంబర్ 19న ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈసినిమా కథ గురించి రోజుకొక రూమర్ వస్తున్నా సినిమా బయటికి వచ్చేదాకా ఏది నమ్మలేం. ఇది ఇలా ఉండగా ఇందులో రామ్ చరణ్ చాలా రెగ్యులర్ లుక్ లో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడని వార్తలు వచ్చాయి.

'అరవింద సమేత' సినిమా కోసం స్లిమ్ గా ఫిట్ గా సిక్స్ ప్యాక్ చూపించిన తారక్ ఇప్పుడు #RRR కోసం భారీకాయుడిగా మారిపోయాడు. మొన్నటివరకు సన్నగా ఉన్న తారక్ ఈసినిమా కోసం లావు పెరిగాడట. సిక్స్ ప్యాక్ కోసం లాయిడ్ స్టీవెన్స్ అనే సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ సహాయం తీసుకున్నాడు తారక్. ఇప్పుడు అదే ట్రైనర్ సహాయం తీసుకుని హల్క్ అవతారం లోకి మారాడట.

గుబురు గడ్డం వేసుకుని ఉన్న తారక్ ఫొటోస్ రీసెంట్ గా బయటికి వచ్చాయి. చరణ్ - తారక్ ల మధ్య ఒక భారీ యాక్షన్ బ్లాకును తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. దాని కోసం ఒక స్పెషల్ సెట్ ను నిర్మించారు. 2020 సమ్మర్ లో ఈసినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు

Similar News