ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ ఉంటాడా..?

Update: 2018-10-22 07:33 GMT

గత కొన్నిరోజులుగా బాలకృష్ణ - క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడని.. అది కూడా అరవింద సమేత సక్సెస్ మీట్ వేదిక మీద బాలయ్య ప్రకటిస్తాడనే ప్రచారం జరిగింది. కానీ బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ ఊసు అరవింద సమేత స్టేజ్ మీద ఎత్తనే లేదు. అలాగే ఎన్టీఆర్ గురుంచి కూడా పొడిపొడిగా మాట్లాడాడు. అయితే, బాబాయ్ అబ్బాయ్ కలిసిపోయారు అందుకే ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ, ఎన్టీఆర్ కి ఒక రోల్ ఇచ్చాడు ఇక ఎన్టీఆర్ కూడా ఆనందంతో ఆ రోల్ చెయ్యడానికి రెడీ అయ్యాడంటూ రెండు రోజులుగా ఊదరగొట్టారు.

కేవలం రూమర్ మాత్రమే...

మరి అది కేవలం గాసిప్ అనేది నిన్న రాత్రి జరిగిన అరవింద సమేత సక్సెస్ మీట్ లోనే క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఎవ‌రెవ‌రు, ఏయే పాత్ర‌లు చేస్తున్నార‌న్న విష‌యం బయటకు వచ్చేసింది. ఇందులో కొత్త పాత్ర‌లేం లేవు. ఎన్టీఆర్ చేయ‌ద‌గిన పాత్ర అస్స‌లు లేదు.. కానీ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ అంటూ తెగ ప్రచారం జరిగింది. ఫైనల్ గా ఇది కేవలం రూమరే గాని అందులో నిజం ఏమాత్రం లేదు అనేది సత్యం.

Similar News