ఎన్టీఆర్, చరణ్ లు అప్పుడైనా వస్తారా..?

టాలీవుడ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల గురించి వెయిట్ చేస్తుంది. ఎన్నికల సీజన్ కాబట్టి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. అలానే సినిమాలు కూడా రిలీజ్ [more]

Update: 2019-04-03 06:18 GMT

టాలీవుడ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల గురించి వెయిట్ చేస్తుంది. ఎన్నికల సీజన్ కాబట్టి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. అలానే సినిమాలు కూడా రిలీజ్ అవ్వవు. అంతా రిలాక్స్ మోడ్ లో ఉంటే రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు మాత్రం తెగ కష్టపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీ కావడం అభిమానులకు ఓ పక్క సంతోషంగానే ఉన్నా మరోపక్క ప్రచారానికి వచ్చి ఉంటే టీడీపీ, జనసేనలకు ఎంతో హెల్ప్ అయ్యేదని అనుకుంటున్నారు. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు.

ఓటైనా వేస్తారా..?

రామ్ చరణ్, ఎన్టీఆర్ లు 45 రోజుల పాటు సాగే సుదీర్ఘమైన షెడ్యూల్ లో అహ్మదాబాద్ కి వెళ్లారు. ఇక్కడ రాజకీయ వేడికి దూరంగా చరణ్, తారక్ లు ఇద్దరూ ఖాళీ దొరికితే చాలు బయటికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారట. వీరిద్దరూ కలిసి ఓ టూవీలర్ మీద చక్కర్లు కొడుతున్న లీక్డ్ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మరి వీరు కనీసం తమవంతుగా వచ్చి ఓటు వేస్తారో లేదో అనేది ఇంకా డౌట్ గానే ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News