బాహుబలికి చెక్ పెట్టనున్న రాజమౌళి?

ప్రస్తుతం టాలీవుడ్ లో బాహుబలిని కొట్టాలని తెరకెక్కిన సాహో, సై రా లాంటి సినిమాలు బాహుబలి ఛాయలకు కూడా వెళ్లలేక చతికిల పడ్డాయి. అయితే అల్లు అర్జున్ [more]

Update: 2020-01-31 05:19 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో బాహుబలిని కొట్టాలని తెరకెక్కిన సాహో, సై రా లాంటి సినిమాలు బాహుబలి ఛాయలకు కూడా వెళ్లలేక చతికిల పడ్డాయి. అయితే అల్లు అర్జున్ మాత్రం ఆలా వైకుంఠపురములో నాన్ బాహుబలి రికార్డులు కొల్లగొడుతున్నాడు. కానీ బాహుబలి ని టచ్ చెయ్యడం అనేది ఎవ్వరి వల్ల కాదనేది జగమెరిగిన సత్యం. మరి బాహుబలిని కొట్టే సత్తా కేవలం రాజమౌళికె ఉందని మనం ఎప్పుడో చెప్పుకున్నాం. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఫిలిం #RRR సినిమా ఖచ్చితంగా బాహుబలి రికార్డులను తుడిచిపెట్టడం ఖాయం గా కనబడుతుంది. 400 కోట్లతో తెరకెక్కుతున్న #RRR లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలు కాబట్టి బాహుబలి రికార్డులను తుడవగలదో లేదో కానీ.. దర్శకుడు రాజమౌళి సినిమా కాబట్టి బాహుబలి రికార్డులను కొల్లగొట్టడం మాత్రం ఖాయం.

ఇప్పటినుండే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ #RRR సినిమాకి రెండొందల కోట్ల బిజినెస్ జరుగుతుంది.. ఇంతగా #RRR మీద పెట్టుబడి పెడుతుంది మాత్రం హీరోలను చూసి కాదు… దర్శకుడిని చూసి అంటున్నారు. ఎలాంటి సీజన్ లో దిగిన రాజమౌళి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 200 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలాగూ సినిమా విడుదలయ్యాక ఓ వారం పాటు టికెట్స్ ధరలు హై లో ఉంటాయి. కాబట్టి ఈ కలెక్షన్స్ ఈజీగా వచ్చేస్తాయని అంటున్నారు. హిట్ టాకొచ్చినా కలెక్షన్స్ ఢోకా ఉండదని.. ఒకవేళ బ్లాక్ బస్టర్ పడితే మాత్రం #RRR రికార్డుల వేట షురూ అంటున్నారు.

Tags:    

Similar News