ఎన్టీఆర్ కి పోటీ ఇచ్చేస్తుందిలే...!

Update: 2018-06-14 06:42 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసిన డీజే దువ్వాడ జగన్నాథం భామ పూజ హెగ్డే కి మాములుగా అదృష్టం పట్టలేదు. మొదటగా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ అరవింద సమేతలో ఛాన్స్ కొట్టేసి షాక్ ఇచ్చిన పూజ హెగ్డే... ఆ వెంటనే మహేష్ 25 మూవీ లోనూ ఛాన్స్ కొట్టేసింది. వంశీ - మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో మహేష్ కి జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది. ఇదిలా ఉంటే బాహుబలి ప్రభాస్ పక్కన రాధాకృష్ణ సినిమా లోను హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి అదృష్టం అంటే పూజ దే అనిపించేలా చేసింది. మరి ఒకేసారి ముగ్గురు హీరోల సినిమాలతో అస్సలు కాల్షీట్స్ ఖాళీ లేకుండా ఉందిన ఆమె. ముగ్గురు హీరోల సినిమాలులు దాదాపుగా ఒకేసారి సెట్స్ మీదకెళతాయని.. అందుకే పూజ కి ఈ ఏడాది రెస్ట్ అనేది ఉండదు అనుకుంటున్నారు అంతా.

ఎన్టీఆర్ తో డ్యాన్స్ అంటే మాటలా...

అంతేకాకుండా మహేష్, ప్రభాస్ పక్కన పూజ నటించడం తేలిక కానీ.. ఎన్టీఆర్ పక్కన పూజ హెగ్డే బాగా కష్టపడాల్సి వస్తుంది అంటూ ప్రచారం జరిగింది. అయితే ఎన్టీఆర్ తో పాటల్లో డాన్స్ లు వేసే విషయంలో ఎన్టీఆర్ పక్కన పూజ అలిసిపోవడం ఖాయమన్నారు. మరి పూజకి డాన్స్ లో బాగానే ప్రాక్టీస్ ఉంది. టాలీవుడ్ టాప్ డాన్సర్ అయిన అల్లుఅర్జున్ పక్కన డీజే లో డాన్స్ ఇరగదీసింది. అల్లు అర్జున్ కి పోటీగా పూజ గుడిలో బడిలో మడిలో... ఇలా అన్ని సాంగ్స్ లోనూ డాన్స్ తో ఆకట్టుకుంది. మరి ఆ ప్రాక్టీస్ తో ఎన్టీఆర్ పక్కన డాన్స్ చెయ్యడం పూజ కి పెద్ద కష్టమే కాదు. ఇప్పటికే ఎన్టీఆర్ అరవింద సమేత లో తన సీన్స్ కి సంబంధించిన చిత్రకరణ పూర్తి చేసుకుని మహేష్ సినిమా కోసం రెడీ అయ్యింది పూజ. ఇక ఎన్టీఆర్ తో కలిసి పాటల్లో స్టెప్స్ వెయ్యడం మిగిలింది. ఇక ఈ స్టెప్స్ లో పూజ ఎన్టీఆర్ పక్కన అలవోకగా డాన్స్ వేసెయ్యగలదంటున్నారు.

మహేష్, ప్రభాస్ తో ఈజీనే...

ఇక మహేష్, ప్రభాస్ పక్కన డ్యాన్స్ వేయడం చాలా ఈజీనే. అయితే ఎన్టీఆర్ సినిమా లో పూజ హెగ్డే కి ఉన్న ఇంపార్టెన్స్ మహేష్ సినిమాలో ఉండకపోవచ్చని టాక్ వినబడుతుంది. త్రివిక్రమ్ సినిమా ల్లో హీరోయిన్ కి మంచి ప్రాధాన్యత ఉంటుంది. కానీ వంశీ సినిమాల్లో హీరోయిన్స్ కి అంతగా ప్రాముఖ్యత ఉండదు. ఇక ప్రభాస్ తో పూజ చేసే చిత్రం కూడా కథ ప్రకారం హీరోయిన్ కోసమే ప్రభాస్ చెట్లు పుట్టలు ఎక్కుతాడని కూడా ప్రచారంలో ఉంది. అంటే పూజ కి ప్రభాస్ పక్కన మంచి ప్రాముఖ్యతే దక్కుతుంది. మరి ప్రభాస్, మహేష్ పక్కన డాన్స్ ల విషయంలో ఎన్టీఆర్ తో కష్టపడినట్లు కష్టపడక్కర్లేదు. వారిద్దరి పక్కన పూజ అలవోకగా డాన్స్ చేసెయ్యగలదులే....!

Similar News