కెజిఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ నెక్స్ట్?

కన్నడలో గత ఏడాది తెరకెక్కిన కెజిఎఫ్ సినిమా పలు భాషల్లో విడుదలై సూపర్ సన్సేషన్ గా కలెక్షన్స్ కొల్లగొట్టింది. మరి ఒకే ఒక్క కన్నడ సినిమాతో యాష్ [more]

Update: 2019-06-05 08:42 GMT

కన్నడలో గత ఏడాది తెరకెక్కిన కెజిఎఫ్ సినిమా పలు భాషల్లో విడుదలై సూపర్ సన్సేషన్ గా కలెక్షన్స్ కొల్లగొట్టింది. మరి ఒకే ఒక్క కన్నడ సినిమాతో యాష్ ఇండియా వైడ్ గా పేరు సంపాదించాడు. ఆ సినిమా యూత్ కి, మాస్ కి బాగా కనెక్ట్ కావడంతో.. ఆ రేంజ్ సూపర్ హిట్ అయ్యింది. అయితే కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ తో ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ యాష్ హీరోగా కెజిఎఫ్ పార్ట్ 2 ని కూడా విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నాడు. పలువురు సెలెబ్రిటీ నటీనటులల్తో భారీ బడ్జెట్ తో కెజిఎఫ్ 2 సినిమా తెరకెక్కుతుంది. అయితే కెజిఎఫ్ హిట్ అయిన కొత్తల్లో ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగులో దిల్ రాజు నిర్మాతగా ప్రభాస్ హీరోగా ఓ సినిమాని డైరెక్ట్ చేస్తున్నట్లుగా తెగ ప్రచారం జరిగింది.

అయితే అదంతా కేవలం రూమర్ అని తేలిపోయింది. తాజాగా కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ నెక్స్ట్ అంటూ వార్తలొస్తున్నాయి. ప్రస్తుతానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో #RRR సినిమాలో నటిస్తున్నాడు. నిన్నటివరకు గాయాలతో #RRR షూటింగ్ కి దూరంగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ఫ్రెష్ గా #RRR షెడ్యూల్లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతానికి బ్రిటిష్ సైనికులతో ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. అయితే #RRR తర్వాత ఎన్టీఆర్ మూవీ కి ఇంకా డైరెక్టర్ కన్ఫర్మ్ కాలేదు. కానీ తాజాగా కెజిఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్ ఓ అద్భుతమైన స్టోరీ లైన్ తో ఎన్టీఆర్ ని కలిసాడని.. ఆ లైన్ మెచ్చిన ఎన్టీఆర్ #RRR తర్వాత సినిమా చేద్దామని చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి.

Tags:    

Similar News