#RRR కోసం న్యూ లుక్ లోకి ఎన్టీఆర్..?

Update: 2018-10-22 07:05 GMT

ప్రస్తుతం అరవింద సమేత విజయంతో ఫుల్ ఖుషీలో ఉన్న ఎన్టీఆర్ ఒక నెల రెస్ట్ తీసుకోబోతున్నాడంటూ వార్తలొచ్చినప్పటికీ... అరవింద సమెత ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. సక్సెస్ మీట్, ఛానల్స్ ఇంటర్వూస్, విజయోత్సవ సభ అంటూ హడావిడి చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం కంప్లీట్ గా రెడీ అవుతున్నాడట. అరవింద సమేత కోసం డిఫరెంట్ లుక్ కోసం పెద్దగా ట్రై చెయ్యని ఎన్టీఆర్ ఫిట్ గా అయితే కనబడ్డాడు. కానీ రాజమౌళి మల్టీస్టారర్ కోసం మాత్రం న్యూ లుక్ లోకి ఎన్టీఆర్ మారబోతున్నాడట.

జింబాబ్వే ఫిట్ నెస్ ట్రైనర్ తో...

రాజమౌళి దర్శకుడిగా రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలిసి బడా మల్టీస్టారర్ ని డీవీవీ దానయ్య నిర్మాణంలో చేయబోతున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 18 నుండి పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే ఈ లోపు ఎన్టీఆర్ న్యూ లుక్ లోకి మారబోతున్నాడని... రామ్ చరణ్ కూడా సిక్స్ ప్యాక్ లుక్ కోసం ఇప్పటికే జిమ్ లో కష్టపడుతున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. ఇక ఈ సినిమా కోసం జింబాబ్వేకు చెందిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ లోయ్డ్ స్టీవెన్స్ తో రాజమౌళి... ఎన్టీఆర్ లుక్ గురుంచి చర్చించాడట.

Similar News