బాలయ్యకి తలొగ్గిన క్రిష్?

బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించి ప్రేక్షకులకు రెండు పార్టులుగా అందించాడు. కథానాయకుడు, మహానాయకుడు గా ఎన్టీఆర్ జీవిత చరిత్రని తెరమీద ఆవిష్కరించాడు. బాలకృష్ణ [more]

Update: 2019-02-23 05:14 GMT

బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించి ప్రేక్షకులకు రెండు పార్టులుగా అందించాడు. కథానాయకుడు, మహానాయకుడు గా ఎన్టీఆర్ జీవిత చరిత్రని తెరమీద ఆవిష్కరించాడు. బాలకృష్ణ తాను ఎలా తండ్రి బయోపిక్ ని తియ్యాలనుకున్నాడో అలానే తీసి విడుదల చేసాడు. తండ్రి గారి జీవిత చరిత్రని సినిమా గా తియ్యడం తన కర్త్యవ్యం అన్నట్టుగా బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించాడు. దర్శకుడుగా ముందు తేజని అనుకుని.. ఆతర్వాత తేజ ప్లేస్ లోకి దర్శకుడు క్రిష్ ని తీసుకురావడంతో.. ఎన్టీఆర్ బయోపిక్ రూపురేఖలు మారిపోయాయి. క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తీద్దామని బాలయ్య కి చెప్పడంతో బాలయ్య కూడా సరే అనడంతో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడిగా ఎన్టీఆర్ బయోపిక్ మారిపోయింది.

ఇక కథానాయకుడిలో క్రిష్ బాలకృష్ణ ని ఎన్టీఆర్ పాత్రలో మంచి… ఎన్టీఆర్ కి వన్నె తెచ్చిన గెటప్స్ తో అందంగా చూపించాడు. ఇక మహానాయకుడువు కూడా క్రిష్ తనదైన శైలిలో తెరకెక్కించలేకపోవడానికి కారణం బాలకృష్ణే అన్నట్టుగా ఉంది మహానాయకుడు ని చూసిన తర్వాత వ్యవహారం. మహానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ రాజకీయరంగేట్రం, సీఎం అవ్వడం అనేవి చాలా ఎమోషనల్ గా బలంగా చూపించాలి. కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ఆపార్టీని స్థాపించడం, సీఎం అవడం, అలాగే ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లడం అనేవి అంతగా టచ్ అవలేదు. ఏదో నార్మల్ ఫ్లోలోనే ఆ సన్నివేశాలు జరిగిపోయాయి. ఇక నాదెండ్లను పవర్ ఫుల్ నెగెటివ్ కేరెక్టర్ గా చేసిన తీరు బావుంది. కానీ చంద్రబాబు ని మరీ హీరోగా చూపించడం బావుండలేదు. అది క్రిష్ అనుకున్న పాయింట్ అయ్యి ఉండదు. ఏదో బాలయ్య చెబితే క్రిష్ చేసినట్టుగా అనిపిస్తుంది. అందుకే సోషల్ మీడియా సాక్షిగా CBN మహానాయకుడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక CBN బయోపిక్ ఫస్ట్ పార్ట్ అంటూ కామెడీ కామెంట్స్ చేస్తున్నారు.

మరి క్రిష్ అనుకున్నట్టుగా కాకుండా బాలకృష్ణ తనకు నచ్చింది క్రిష్ చేత తీపించినట్టుగా చాలా సన్నివేశాలు అనిపిస్తాయి. ఇక సినిమాని ఎన్నికల లోపు విడుదల చెయ్యాలనే అతృతతో.. చాల సన్నివేశాలను స్టూడియోస్ లో సెట్స్ వేసి మమ అనిపించేసారు. అందుకే చాలా సన్నివేశాలు నేచురల్ గా అనిపించకుండా చాలావరకు ఆర్టిఫీషియల్ గా అనిపిస్తాయి. మరి 200 రోజులు క్రిష్ అస్సలు రెస్ట్ లేకుండా ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల షూటింగ్ ని చిత్రీకరించాడు. కానీ క్రిష్ పడిన కష్టం తెరమీద కనబడుతున్నప్పటికీ.. ప్రేక్షకుడు ఎందుకో అంతగా సినిమా ను రిసీవ్ చేసుకోలేక పోతున్నాడు. మరి కథానాయకుడు సినిమాకి సూపర్ హిట్ టాక్ అండ్ రివ్యూస్ వస్తే.. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. మరి ఇప్పుడు మహానాయకుడు కి ప్రేక్షకుడు నుండి రివ్యూ రైటర్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. చూద్దాం ఫైనల్ గా మహానాయకుడు పరిస్థితి ఏమిటి అనేది.

Tags:    

Similar News