మళ్ళీ బ్యాండ్ పడింది

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ఫిలిం ఎనౌన్సమెంట్ వచ్చేసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ. RRR తో క్రేజీ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ తరవాతి సినిమా క్లారిటీ వచ్చేసింది. [more]

Update: 2020-02-20 07:05 GMT

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ఫిలిం ఎనౌన్సమెంట్ వచ్చేసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ. RRR తో క్రేజీ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ తరవాతి సినిమా క్లారిటీ వచ్చేసింది. ఇక అలా వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ క్రేజ్ ఆకాశంలో వేలాడుతుంది. RRR హీరో, అలా వైకుంఠపురములో దర్శకుడు కలిస్తే ఆ సినిమా పై అంచనాలు ఆకాశంలోనే ఉంటాయి. అందునా భారీ అంటే అరవింద సమేత కన్నా డబుల్ బడ్జెట్ తో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా. అబ్బా వినడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎంత సమ్మోహం గా ఉందో. మరి ఈ సినిమాని త్రివిక్రమ్ ఓన్ బ్యానర్ లాంటి హారిక హాసిని చినబాబే నిర్మించాలని అనుకున్నాడు. ఎందుకంటే నిన్నగాక మొన్న అలా వైకుంఠపురములో లాభాలన్నీ జేబులో వేసుకుందామనుకుంటే… అల్లు అర్జున్ త్రివిక్రమ్ ని ఒప్పించి తన తండ్రి అల్లు అరవింద్ ని భాగస్వామిని చేసి చినబాబు కి బ్యాండ్ వేసాడు.

చినబాబు సినిమా బ్లాక్ బస్టర్ అయినా కక్కలేక మింగలేక ఉన్నాడు కానీ.. హ్యాపీ గా లేడు. మరి తాజాగా ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ ని ఒప్పించి అన్న కళ్యాణ్ రామ్ ని మధ్యలోకి తెచ్చి హారిక హాసినితో పాటుగా నందమూరి ఆర్ట్స్ ని భాగస్వామిని చేసాడు. మరి ఎన్టీఆర్ తో సినిమా అనగానే చినబాబు హ్యాపీ అవడానికి లేకుండా కళ్యాణ్ రామ్ అడ్డం అపడుతున్నాడు. వచ్చే లాభాల్లో ఖచ్చితంగా వాటా ఇవ్వాలి గనక చినబాబు కి మళ్ళీ ఎన్టీఆర్ వలన బ్యాండ్ పడింది. మరి త్రివిక్రమ్ సినిమాల కోసం చినబాబు ఏం మాట్లాడలేకపోతున్నాడు. మరి ఏ హీరో అయినా త్రివిక్రమ్ తో సినిమా చేస్తే హారిక హాసినితో పాటు తమ ఓన్ బ్యానర్ ని తీసుకొచ్చి చినబాబు ని అడ్డంగా ఇరికిస్తున్నారు. ఇక చినబాబు మాత్రం త్రివిక్రమ్ మొహం చూసి ఏం అనలేక నీళ్లు నములుతున్నాడట.

Tags:    

Similar News