సినిమా కోసం 20 కేజీల బరువు తగ్గిన హీరో

Update: 2018-04-05 09:26 GMT

త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ ఏ పాత్ర పోషిస్తున్నాడో తెలియదు కానీ.. చాలా స్లిమ్ గా కనపడుతున్నాడు. త్రివిక్రమ్ తో సినిమా ఒకే చేసిన దగ్గర నుండి స్లిమ్ గా కనిపించాలని గట్టి కసరత్తే చేశాడు తారక్. సినిమా రెగ్యులర్ షూటింగ్ కు ముందే బరువు బాగా తగ్గి స్లిమ్ గా.. మ్యాన్లీగా తయారయ్యాడు. ఇందు కోసం గట్టి కసరత్తే చేశారు.

మూడు నెలల్లో దాదాపు 20 కేజీల బరువు తగ్గాడంట తారక్. అంత తక్కువ టైంలో అన్ని కేజీల బరువు తగ్గటం అంటే మాములు విషయం కాదు. ప్రత్యేకంగా ఫారిన్ నుంచి ఫిట్ నెస్ ట్రైనర్ ను పిలిపించుకున్నాడు. బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్.. హృతిక్ రోషన్ లకు ట్రైనింగ్ ఇచ్చిన లాయిడ్ స్టీవెన్స్ ను బరువు తగ్గేందుకు ట్రైనర్ గా నియమించుకున్నాడు . అతను చెప్పిన డైట్ తారక్ రెగ్యులర్ గా ఫాలో అయ్యి ఇన్ని కేజీల బరువు తగ్గానని చెబుతున్నాడు. రోజుకు కనీసం నాలుగు గంటలు ఐన జిమ్ లో వర్కవుట్స్ చేశానని లేటెస్ట్ గా జరిగిన ఓ కార్యక్రమములో ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ ప్రమోషన్ ఈవెంట్లో ఎన్టీఆర్ ని చూసినవారంతా చాలా స్లిమ్ గా మ్యాన్లీగా గా కనిపిస్తున్నారని కాంప్లిమెంట్ ఇచ్చేశారు. అయితే తారక్ మాత్రం తానూ వెయిట్ తగ్గే పని ఇంకా పూర్తి కాలేదని.. ఇంకా కొన్ని కేజీల బరువు తగ్గాలని అన్నాడు. చూస్తుంటే ఈ సినిమా కోసం తారక్ చాలానే కష్టపడుతున్నాడు అని అర్ధం అవుతుంది. మరి ఈ సినిమాలో తారక్ లుక్ ఎలా ఉంటాడో చూడాలి.

Similar News