ఎన్టీఆర్ సినిమా ఫొటో లీకయిందే...!

Update: 2018-07-23 07:20 GMT

జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన కాలేజ్ సెట్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యిందని సమాచారం. ఆ కాలేజ్ సెట్ లో హీరోయిన్ పూజ హెగ్డే, ఎన్టీఆర్ ల మీద కాలేజ్ సీన్స్ ని తెరకెక్కించారట. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫ్యాక్షన్ కక్షలు.. అనేది కామన్ పాయింట్. ఇకపోతే ఈ సినిమాలో మరో హీరోయిన్ ఈషా రెబ్బ కూడా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఈషా.. ఎన్టీఆర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లా కనబడనుందని సమాచారం

ఎన్టీఆర్, నాగబాబు ఫోటో లీక్

ఇంకా ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి పాత్రలో మెగా హీరో నాగబాబు నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని యాక్షన్ అండ్ ఫ్యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా... తాజాగా అరవింద సామెత లో ఆ యాక్షన్ పార్ట్ కి సంబంధించిన ఒక పిక్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. నాగ బాబు - ఎన్టీఆర్ లకు సంబంధించిన వర్షంలో తీసిన ఓ సీన్ కు సంబంధించిన పిక్ లీకైంది. ఆ పిక్ లో ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్ గా టెన్షన్ గా నాగ బాబు అంటే తన తండ్రిని ఎలాగైనా బతికించుకోవాలని తపనతో కనబడుతున్నాడు. ఇక నాగబాబు కు గాయాలు అయ్యాయి కానీ.. అవి ఎలాంటి గాయాలో ఈ పిక్ లో స్పష్టత లేదు. కాకపోతే ఆ కారులో కళ్లు మూసుకుపోయి, తల పక్కకు వాల్చిన నాగబాబును... ఎన్టీఆర్ దీనంగా చూస్తూ... గడ్డం పట్టుకుని లేపుతున్నట్టు మాత్రమే కనిపిస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్

మరి అరవింద సమేత షూటింగ్ స్పాట్ నుండి ఈ పిక్ ఎవరు లీక్ చేశారో తెలియదు గాని.. ఇప్పుడా ఎమోషనల్ పిక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ఆ వైరల్ గా మారిన అరవింద సమేత పిక్ ని మీరు ఓ లుక్కేయండి. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.

Similar News