ఎన్టీఆర్ కథానాయకుడు ఓపెనింగ్ షాట్ ఇదే..!

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్. సినిమా రిలీజ్ దగ్గర పడడంతో బాలకృష్ణ – క్రిష్ ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ [more]

Update: 2018-12-26 06:26 GMT

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్. సినిమా రిలీజ్ దగ్గర పడడంతో బాలకృష్ణ – క్రిష్ ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు రిలీజ్ చేసిన ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలు ఉండడంతో సినిమా ఎలా ఉండబోతుంది..? అసలు ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తున్నారు..? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో రీసెంట్ గా “కథానాయకుడు” సినిమా ఓపెనింగ్ సీన్ ఎలా ఉండబోతుందని చర్చ జరిగింది.

హాస్పిటల్ సీన్ తో స్టార్ట్

తాజా సమాచారం ప్రకారం సినిమా ఓపెనింగ్ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని చెబుతున్నారు. హాస్పిటల్ లో ఎన్టీఆర్ భార్య బసతారకంపై ఓపెన్ సీన్ ఉంటుందట. బసతారకం కాన్సర్ తో పోరాడే సీన్ ను చూపిస్తారట. బసతారకం పరిస్థితి చూసి అక్కడే హాస్పిటల్ లో చైర్ మీద ఎన్టీఆర్ కూలబడిపోయి అసలు తాను స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు అనేది ఆలోచించుకుంటున్నపుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడని చెబుతున్నారు. ఇలా ఓపెనింగ్ సీనే ఎమోషనల్ గా చూపిస్తే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని క్రిష్ భావిస్తున్నాడు. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న, రెండవ పార్ట్ ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతున్నాయి.

Tags:    

Similar News