క్రిష్ వల్లనే మహానాయకుడుకి ఈ పరిస్థితి

ప్రస్తుతం దర్శకుడు క్రిష్ మహానాయకుడు సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా తలమునకలై ఉంటాడనుకున్నారు అంతా. అయితే నిజంగా క్రిష్ అలానే ఉండేవాడు. ఎదుకంటే మనికర్ణికను [more]

Update: 2019-01-31 05:08 GMT

ప్రస్తుతం దర్శకుడు క్రిష్ మహానాయకుడు సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా తలమునకలై ఉంటాడనుకున్నారు అంతా. అయితే నిజంగా క్రిష్ అలానే ఉండేవాడు. ఎదుకంటే మనికర్ణికను పక్కనబెట్టి… వచ్చినప్పటి నుండి ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు షూటింగ్ ని ఎంతో శ్రద్ద గా కేవలం ఐదారు నెలలోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు క్రిష్. ఎన్టీఆర్ బయోపిక్ ని ఒక మహాయజ్ఞం లా పూర్తి చేసాడు. అయితే కథానాయకుడు సినిమా ని అనుకున్న టైం కి ప్రేక్షకుల ముందుకు తెచ్చిన క్రిష్.. ఆ సినిమా కి కలెక్షన్స్ రాకపోవడానికి కారణమయ్యాడా…? అదేమో తెలియదు కానీ… మహానాయకుడు మాత్రం అనుకున్న టైం కి విడుదలకాకపోవడానికి క్రిష్ కారణం అంటున్నారు.

ప్రస్తుతం మహానాయకుడు షూటింగ్ చిత్రీకరణలో ఉండాల్సిన క్రిష్.. తానూ బాలీవుడ్ లో తెరకెక్కించిన మణికర్ణిక సినిమా విషయంలో కంగనా రనౌత్ మీద నిప్పులు చెరిగే పనిలో బిజీగా వున్నాడు. మణికర్ణిక సినిమాని తానూ డైరెక్ట్ చేస్తే కంగనా దర్శకత్వం పేరులో తన పేరు వేసుకుంది…. తాను మణికర్ణిక సినిమాని బంగారంలా చేస్తే కంగనా దాన్ని ఇత్తడిలా మర్చేసిందంటూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నాడు. మణికర్ణిక సినిమా విడుదలకు ముందు గమ్మునున్న క్రిష్ ఆ సినిమా విడుదలయ్యాక కంగనా మీద ఫైర్ అవుతున్నాడు. మరోపక్క కథానాయకుడు సినిమా దెబ్బకి.. మహానాయకుడు లో పర్ఫెక్షన్ తో పాటుగా లెన్త్ తగ్గించే పనిలో మళ్ళి రీ షూట్స్ చేస్తున్నారనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.

కథానాయకుడులో మిస్ అయిన ఎమోషన్స్, కామెడీ అన్ని మహానాయకుడిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందుకే కొన్ని సన్నివేశాలని మళ్ళీ రీ షూట్స్ చేస్తున్నట్లుగా టాక్. ఇక సోషల్ మీడియాలో మహానాయకుడి మహా రిపేర్లు అంటూ కొంతమంది నెగెటివ్ ప్రచారానికి రెడీ అవుతున్నారు. అయితే క్రిష్ కథానాయకుడు సినిమా విషయంలో అయినట్లుగా కాకుండా మహానాయకుడు మీద మనసు పెట్టాలని.. విడుదలైపోయి ప్లాప్ అయిన మణికర్ణిక విషయంలో కాస్త తగ్గితే బావుంటుందని నందమూరి అభిమానుల అభిప్రాయం. మణికర్ణిక విషయం పక్కనపెట్టకపోతే మహానాయకుడుకి చేటు జరగడం ఖాయమంటున్నారు. ఇక మహానాయకుడు సినిమా ఫిబ్రవరి 7 న విడులవ్వాల్సి ఉండగా… ఇప్పుడు ఫిబ్రవరి 22 న మహానాయకుడు విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు.

Tags:    

Similar News