అపురూపమైన ఫోటో పోస్ట్ చేసిన ఎన్టీఆర్

Update: 2018-06-18 07:33 GMT

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ తో యమ బిజీగా ఉన్నాడు. మరో వైవు రెండోసారి కొడుకు పుట్టడం కూడా ఎన్టీఆర్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అభయ్ రామ్ తర్వాత లక్ష్మి ప్రణతి మళ్లీ పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చిందనే సంగతి తెలిసిందే . అదే విషయాన్నీ యంగ్ టైగర్ తన ట్విట్టర్ ద్వారా అందరికి తెలియజేశాడు. తాజాగా ఎన్టీఆర్ తన చిన్న కొడుకుని పెద్ద కొడుకు అభయ్ రామ్ తో కలిసి అభిమానులకు పరిచయం చేసాడు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టీవ్ అయిన ఎన్టీఆర్ తాజాగా ఇన్స్ టాగ్రామ్ లో కూడా అడుగుపెట్టాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తన పెద్ద కొడుకు అభయ్ రామ్ ఒళ్ళో చిన్న కొడుకుని కూర్చో బెట్టి తీస్తున్న ఫోటోని మరొకరు ఫోన్ లో బంధించారు. ఈ ఫోటోని ఇన్స్ టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు తారక్. మరి ఇన్స్ టాగ్రామ్ లో అడుగుపెట్టిన మొదట్లో మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా తన కూతురు అర్హ ఫోటో ని పెట్టి ఓపెనింగ్ చేసాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ కూడా అల్లు అర్జున్ నే ఫాలో అయినట్లుగా అనిపిస్తుంది. తాజాగా ఇన్స్ టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ తన రెండో కొడుకు ఫోటోని పెట్టాడు.

Similar News