యన్.టి.ఆర్ లో హెచ్.ఎం.రెడ్డిగా కైకాల..!

Update: 2018-07-25 13:57 GMT

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న యన్.టి.ఆర్ బయోపిక్ మొదటి షెడ్యూల్ నిన్నటితో పూర్తయ్యింది. ఈ చిత్రంలో నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ ప్రఖ్యాత చిత్ర నిర్మాత, తెలుగు సినిమా పితామహుడు అయిన హెచ్.ఎం.రెడ్డి పాత్రను పోషిస్తున్నారు. తన నటనతో వందలాది చిత్రాల్లోని పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన కైకాల సత్యనారాయణ యన్.టి.ఆర్ బయోపిక్ లో హెచ్.ఎం.రెడ్డిగా నటించారు. ఆ మహానుభావుడి పాత్రను ఈ మహానటుడు అమోఘమైన పద్ధతిలో రంజింపజేశారని దర్శకుడు క్రిష్ తెలిపారు. కైకాల సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని సినిమాలో ఆయన లుక్ ను నేడు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Similar News