ఎవ్వరినీ వదలనంటున్న ఎన్టీఆర్

Update: 2018-06-01 06:39 GMT

ఇప్పుడు దేశమంతా సెలబ్రిటీల మధ్య 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' ఛాలెంజ్ ఒక రేంజ్ లో నడుస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ లీడర్స్ నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు.. అలాగే క్రికెటర్స్ దగ్గరనుండి హీరో, హీరోయిన్స్ వరకు.. సెలెబ్రిటీలు మొత్తం ఈ మానియాతో మునిగిపోతున్నారు. ఫిట్ నెస్ అనేది మానవుడి దైనందిన జీవితంలో ముఖ్యమైన పనే. అయితే ఇప్పుడు 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' బాగా పాపులర్ అయ్యి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. అయితే అక్కినేని అఖిల్ ఈ ఛాలెంజ్ ని తన అన్న నాగ చైతన్యకి, నాగార్జున కి, దుల్కర్ సల్మాన్ కి విసరగా... చైతు తన భార్య సమంతకి విసిరాడు. తాజాగా మలయాళ హీరో మోహన్ లాల్.. స్టార్ హీరో ఎన్టీఆర్ కి, తమిళ హీరో సూర్య కి విసిరాడు.

స్నేహితులందరికీ...

మరి ఫిట్ నెస్ లో తనదైన స్టయిల్లో దూసుకుపోయే.. ఎన్టీఆర్ ఊరుకుంటాడా ఎన్టీఆర్ కూడా జిమ్ లో మోహన్ లాల్ విసిరిన 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' ఛాలెంజ్ ని స్వీకరించడమే కాదు.. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ.. ఆ వీడియో ని ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యడమే కాదు... ఈ చాలెంజ్ ని తన ఫ్రెండ్స్ కి, తనకిష్టమైన వారికి విసిరాడు. అంతేకాదు.. తాను రోజూ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఆధ్వర్యంలో వర్క్ అవుట్స్ చేస్తానని చెప్పిన ఎన్టీఆర్ ఈసారి తాను బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మహేష్, రామ్ చరణ్ తో పాటు తన అన్న కళ్యాణ్ రామ్, డైరెక్టర్లు రాజమౌళి, కొరటాల శివకు ఛాలెంజ్ విసిరాడు.

రామ్ చరణ్ కి ట్విట్టర్ అకౌంట్ లేదుగా...

అయితే ఇందులో ఒక గమ్మత్తయిన విషయమేమిటంటే... రామ్ చరణ్ కి ఫేస్ బుక్ అకౌంట్ తప్ప.. ట్విట్టర్ అకౌంట్ లేదు. అందుకే ఎన్టీఆర్ చాలా తెలివిగా తాను విసిరిన 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' ఛాలెంజ్ ని రామ్ చరణ్ కి చెప్పాలని చెర్రీ వైఫ్ ఉపాసనని ట్విట్టర్ సాక్షిగా కోరాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ చేసిన 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' నెట్ లో బాగా వైరల్ అయ్యింది.

Similar News