మహేష్ ని రిక్వెస్ట్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..!

Update: 2018-10-17 06:21 GMT

ఈ నెల 11న ప్రేక్షకుల ముందు భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం 'అరవింద సమేత'. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ కి బ్లాక్ బస్టర్ కి మధ్య దూసుకుపోతుంది. సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం పలు రికార్డులను సాధిస్తూ.. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు ట్రేడ్ వారు. అయితే ఈ సినిమా పై స్పందించండి అంటూ నందమూరి ఫ్యాన్స్ మహేష్ ను కోరుతున్నారు.ఎన్టీఆర్ - మహేష్ మధ్య మంచి అనుబంధం ఉందని అందరికీ తెలిసిందే. గత కొంతకాలం నుండి మహేష్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ ముగ్గురు రెగ్యులర్ గా కలుసుకుంటున్నారు అని అందరికి తెలిసిందే. ఈ ముగ్గురి మద్య మంచి వాతావరణం నెలకొంది.

షూటింగ్ బిజీలో మహేష్

అందుకే 'అరవింద సమేత' చిత్రం గురించి రామ్ చరణ్ స్పందించి ఎన్టీఆర్ అభిమానులను ఖుషీ చేశాడు. కానీ మహేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. మహేష్ ప్రస్తుతం 'మహర్షి' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే 'అరవింద సమేత' ని ఇంకా చూడలేదని తెలుస్తుంది. లేట్ గా చూసిన స్పందించడం పక్కా అని అర్ధం అవుతుంది. ఎందుకంటే వీరి ముగ్గురి ఫ్రెండ్ షిప్ అటువంటిది. ఒకవేళ మహేష్ రియాక్ట్ అయితే కొంచం డల్ గా ఉన్న ఓవర్సీస్ కలెక్షన్స్ పెరిగే అవకాశముందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Similar News