ఇది కదా ఎన్టీఆర్ ఫాన్స్ కి కావాల్సింది!

Update: 2018-10-05 06:23 GMT

ఎన్టీఆర్ అరవింద సమేత ట్రైలర్ విడుదలైంది. అందులో ఎన్టీఆర్ మాస్, క్లాస్ తో ఇరగదీసాడు. హీరోయిన్ పూజ హెగ్డేతో రామాంటిక్ యాంగిల్ తో పాటు శత్రువులను తెగ నరకడం, మొహం లోని గంభీరం, కోపం అన్ని ఎన్టీఆర్ ని అన్ని యాంగిల్స్ లో పరిచయం చేశాయి. ఇక పూజ హెగ్డే ఒకొనొక సమాయంలో ఎన్టీఆర్ ని అలా క్యూట్ గా చూడకురా బాబు అన్నప్పుడు ఎన్టీఆర్ ఫేస్ ఎంత బాగుందో కూడా చూసాం. ఇక చొక్కా లేకుండా ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ని కూడా తనివి తీరా ఆస్వాదించిన ఎన్టీఆర్ ఫాన్స్ కి అరవింద సమేత ట్రైలర్ లో ఒకటి మిస్ అయినందుకు గాను బాగా ఫీల్ అయ్యారు.

ట్రైలర్ లో ఎన్టీఆర్ స్టెప్స్ లేకపోవడంతో...

అది మరేదో కాదు యంగ్ టైగర్ డ్యాన్స్. డ్యాన్స్ ల్లో ఎన్టీఆర్ కి మించిన స్టార్ హీరో లేడనేది ఫాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకుడు చెబుతాడు. ఎన్టీఆర్ డాన్స్ కి ఎంతమంది ఫాన్స్ ఉన్నారో చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ సినిమాల్లో ఎన్టీఆర్ ఎంతమందిని నరుకుతాడో అని ఎదురు చూసే ఫాన్స్... ఆ సినిమాలో పాటలకు ఎన్ని స్టెప్స్ వేస్తాడో అని ఫాన్స్ మాత్రమే కాదు డాన్స్ ప్రేమికులు ఎదురు చూస్తారు. కానీ అరవింద సమేత ట్రైలర్ లో ఎన్టీఆర్ డాన్స్ కి సంబంధించిన ఒక్క బిట్ కూడా త్రివిక్రమ్ కట్ చెయ్యకపోయేసరికి ఎన్టీఆర్ ఫాన్స్ ఉసూరుమన్నారు. ఇక ఎన్టీఆర్ అరవింద ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డాన్స్ నటనలో భాగం మాత్రమే.. డాన్స్ మాత్రం జీవితం కాదు అంటూ అభిమానులకు సర్ది చెప్పాడు.

డ్యాన్స్ ప్రోమో విడుదల...

అన్ని ఉన్న ఏదో వెలితి అన్నట్టుగా ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా ఆ ముచ్చట కూడా తీరింది. ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్స్ వేసిన సాంగ్ వీడియో ఒకటి నిన్న అరవింద సామెత టీం విడుదల చేసింది. అరవింద ఆడియో ఆల్బమ్ లో మొదటి సాంగ్ గా విడుదలైన అనగనగా అరవిందట తన పేరు.. అనే సాంగ్ ప్రోమో లో ఎన్టీఆర్ డ్యాన్స్ ఉంది చూసారా.. ఎన్టీఆర్ ఫాన్స్ పెట్టుకున్న ఆశలు మరింత పెంచేసాయి. అంత అద్భుతమైన డ్యాన్స్ తో ఎన్టీఆర్ ఇరగదీసాడు. ఇక ఏ పాటల్లోనూ ఎన్టీఆర్ డ్యాన్స్ చెయ్యకపోయినా... ఈ స్టెప్స్ చాలు అన్నట్టుగా ఉంది అనగనగా అరవిందట తన పేరు.. లో డ్యాన్స్. మరి ఫాన్స్ ఇది కదా.. మీకు కావాల్సింది.

Similar News