పిక్ టాక్: పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్!

Update: 2018-07-04 08:07 GMT

అరవింద సామెత సినిమా షూటింగ్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఒక్క నిమిషం ఖాళీ లేకుండా గడుపుతున్నాడు. అక్టోబర్ కల్లా ఈ షూటింగ్ పూర్తి చేసుకుని ఖాళీ అయి ఆయన రాజమౌళితో మల్టీస్టారర్ కోసం రెడీ అవుతున్నాడు. ఇకపోతే ఎన్టీఆర్ ఇప్పటివరకు ఒక కొడుకుతోనే అంటే అభయ్ రామ్ తో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ ఫ్యామిలీలోకి మరో బుడతడు వచ్చాడు. ఎన్టీఆర్ కి సెకండ్ టైం కూడా బాబు పుట్టాడు. అందుకే ఎన్టీఆర్ కూడా తన కుటుంబం పెద్దదయినదని... తన ఫ్యామిలీలోకి సంతోషాలు మరిన్ని వచ్చాయని చెప్పాడు. అలాగే తాజాగా తన పెద్దకొడుకు చిన్న కొడుకుని ఎత్తుకుని ఉన్న ఫోటో ఎన్టీఆర్ తన ఫోన్ లో బందిస్తుండగా... లక్ష్మి ప్రణతి పెద్ద కొడుకు చిన్న కొడుకు, ఎన్టీఆర్ లను హోల్ సేల్ గా ఫోటో తియ్యగా.. ఎన్టీఆర్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. మరి ఆ ఫోటో కే ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకున్నారు.

ఫ్యామిలీ ఫోటో సూపర్....

తాజాగా ఎన్టీఆర్ తన భార్య ఇద్దరు కొడుకులతో ఒక ఫోటో కి ఫోజిచ్చారు. ఆ ఫొటోలో ఎన్టీఆర్ చిన్న కొడుకుని ఎత్తుకుని మురిపంగా చూస్తుండగా... పెద్ద కొడుకు అభయ్ రామ్ తండ్రి భుజం మీద నుంచి తమ్ముడిని చూసుకుంటున్నాడు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి కూడా ఎన్టీఆర్ చేతుల్లో ఉన్న చిన్న కొడుకుని చూసుకుంటూ సంతోష పడుతున్న ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్ ని చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఎక్కడా ఆగడం లేదు. తమ హీరో ఇలా ఫ్యామిలీతో సంతోషంగా ఉండడాన్ని చూసి ఆనందపడిపోతున్నారు. మీరూ ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్ ని ఓ లుక్కెయ్యండి.

Similar News