ఎన్టీఆర్ వంటపై అన్న కళ్యణ్ రామ్ ఇంటర్వ్యూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి RRR సినిమా షూటింగ్ నుండి విరామం దొరికింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇంట్లోనే భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాడు. గత ఏడాది కరోనా [more]

Update: 2021-05-10 09:13 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి RRR సినిమా షూటింగ్ నుండి విరామం దొరికింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇంట్లోనే భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాడు. గత ఏడాది కరోనా శాంతించగానే భార్య, పెద్ద కొడుకు తో కలిసి దుబాయ్ వెకేషన్ కి వెళ్లిన ఎన్టీఆర్ షూటింగ్స్ లేనప్పుడు, బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తాడో తెలుసా.. వంట చేస్తాడు. ఎన్టీఆర్ మంచి  చెఫ్ కూడా. ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 అప్పుడు హౌస్ మేట్స్ కి మటన్ బిర్యానీ చేసిపెట్టినప్పుడు ఆయన వంట చేస్తారనే అందరికి తెలిసింది. ఎన్టీఆర్ వంట ఎంత బాగా చేస్తాడో అప్పుడప్పుడు ఆయన ఇంటికి వెళ్లే గెస్ట్ లు చెబుతుంటారు. ఖాళీ సమయాల్లో సాంగ్స్ వింటూ వంట చేస్తుంటాడట ఎన్టీఆర్. ఇంట్లోనే బ్రేడ్ స్లైడ్స్ కూడా తయారు చేసేస్తాడట. ఆ విషయాన్ని ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ చెబుతున్నాడు. 

ఎన్టీఆర్ వంట ఎప్పుడైనా తిన్నారా అని సదరు యాంకర్ కళ్యాణ్ రామ్ ని ప్రశ్నించగా.. బోర్ కొట్టినప్పుడు తారక్ వంట చేస్తాడు. ఫోన్ చేసి అన్నయ్య నేను ఇంట్లో వంట చేస్తున్నా నువ్ భోజనానికి వచ్చేయ్ అని చేబుతాడట. ఇక బిర్యానీ అవి బాగా చేస్తుంటాడు. అపుడప్పుడు వేరే డిష్ లు కూడా చేస్తాడు. ఇంకా విశేషం ఏమిటి అంటే ఇంట్లోనే బ్రేడ్ కూడా తయారు చెయ్యగలడు తమ్ముడు అంటూ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ వంట విషయాలు చెబుతున్నాడు. సినిమా షూటింగ్స్ లేనప్పుడు ఇలా వంట చేస్తూ హోటల్ పెడితే సైడ్ బిజినెస్ లా ఉంటుంది కదా అని ఆటపట్టిస్తుంటామని చెప్పిన కళ్యాణ్ రామ్.. అవును త్మముడు నువ్ వంట చేసేయ్ సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసేద్దామని చెబుతాడు. కానీ తారక్ మాత్రం నేను వంట చేసేది నేను తినడానికి ఫ్రెండ్స్ కి పెట్టడానికి తప్ప అమ్మడానికి, బిజినెస్ చెయ్యడానికి కాదు అంటూ ఓ ఇంటర్వ్యూలో అన్నదమ్ములు సందడి చేసారు.

Tags:    

Similar News