స్టార్ హీరో - స్టార్ కమెడియన్ మధ్య కోల్డ్ వార్?

Update: 2018-06-08 13:14 GMT

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సామెత షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. మాటల మాంత్రికుడు కూడా ఎన్టీఆర్ వేగాన్ని అందుకుంటూ షూటింగ్ ని శరవేగంగా కానిచ్చేస్తున్నాడు. మే 20 న అరవింద సామెత ఫస్ట్ లుక్ తో సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ కొత్త సినిమాపై మళ్ళీ ఇన్నాళ్లకు మరో హాట్ హాట్ న్యూస్ తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అదేమిటంటే.. అరవింద సామెత వీర రాఘవ సెట్స్ లో ఎన్టీఆర్ కి ఒక స్టార్ కమెడియన్ కి మధ్య విభేదాలు తార స్థాయికి చేరుకొని... అది కాస్తా కోల్డ్ వార్ గా మరిందనే న్యూస్ వెబ్, సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది.

ఎడమొహం పెడమొహంగా...

ఆ స్టార్ కమెడియన్ ఎవరో కాదు.. ఒకప్పుడు ఎన్టీఆర్ స్నేహితుడు.. ఇప్పుడు కమెడియన్ కమ్ హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్న శ్రీనివాస్ రెడ్డి. ఒకప్పుడు అంటే గతంలో ఒకసారి ఎన్టీఆర్ టిడిపి తరుపున ఎన్నికల ప్రచారం వరకు బాగా కలిసున్నా ఎన్టీఆర్ - శ్రీనివాస్ రెడ్డి లు ఆ తర్వాత సైలెంట్ గా విడిపోయారు. అసలెందుకు వారిమద్యలో గ్యాప్ వచ్చిందో.. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో చెప్పాడు. కానీ అది నిజం కాదనేది కొందరి వాదన. సరే ఇప్పుడు అరవింద సామెత లో కమెడియన్ గా శ్రీనివాస రెడ్డి ని తీసుకుందామన్న.. త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ వద్దని చెప్పాడంట. అయితే ఆ కేరెక్టర్ కి శ్రీనివాస్ రెడ్డి అయితేనే బావుంటుందని త్రివిక్రమ్.. ఎన్టీఆర్ ని కన్విన్స్ చేయడంతో ఎన్టీఆర్ ఒకే అన్నాడట. అలా ఒకే అన్నప్పటికీ.. శ్రీనివాస్ రెడ్డి అరవింద సామెత షూటింగ్ లోకి అడుగు పెట్టినప్పటి నుండి.. ఎన్టీఆర్ అతనిని పలకరించడం కానీ, కనీసం మొహం తిప్పి చూడడం కానీ చెయ్యకుండా ఇతర నటులతో కాలం గడిపేస్తున్నాడట. పాపం ఇదంతా శ్రీనివాస్ రెడ్డిని బాగానే ఇబ్బంది పెట్టిందట.

షూటింగ్ జరిగేదెలా..?

కానీ తనకి ఇవన్నీ ముఖ్యం కాదు.. తనకిచ్చిన పాత్రకి న్యాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతోనే.. శ్రీనివాస్ రెడ్డి అరవింద సామెత షూటింగ్ లో తన పార్ట్ కంప్లీట్ కాగానే సైలెంట్ గా తన కార్వ్యాన్ లోకి వెళ్ళిపోతున్నాడట. ఇలా ఎన్టీఆర్ - శ్రీనివాస్ రెడ్డి ల మధ్యన కోల్డ్ వార్ ఒక రేంజ్ లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి అలా మొహాలు చూసుకోకుండా షూటింగ్ ఎలా చేస్తారు? శ్రీనివాస్ రెడ్డి - ఎన్టీఆర్ కాంబో సీన్స్ లో ఇద్దరు మాట్లాడుకోవాలి? అలాగే వారి మధ్యన కామెడీ పండాలి అంటే.. ఇద్దరు అలా ఏడ ముఖాలు పేద ముఖాలుగా ఉంటె త్రివిక్రమ్ మాత్రం షూటింగ్ ఎలా చేస్తాడు? అంటే.. ఎన్టీఆర్ - శ్రీనివాస్ రెడ్డి పై వస్తున్న ఆ వార్తలన్నీ అవాస్తవాలు కావొచ్చు? కాకపోనూవచ్చు?కానీ, ప్రస్తుతం మాత్రం ఎన్టీఆర్, శ్రీనివాస్ రెడ్డి ల న్యూస్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో బాగా హాట్ టాపిక్ అయ్యింది.

Similar News