ఎన్టీఆర్- చరణ్ ఫాన్స్ కి ఇక పండగే!!

ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR మూవీ ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. లేదంటే ఈపాటికి RRR షూటింగ్ ఒక [more]

Update: 2020-09-06 06:27 GMT

ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR మూవీ ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. లేదంటే ఈపాటికి RRR షూటింగ్ ఒక కొలిక్కి రావడం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో RRR టీం బిజీగా ఉండేది. కానీ కరోనా అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లింది, ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రజెక్టు డిలే అయ్యేలా చేసింది కరోనా. అయితే ఇప్పుడు టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరిగా సినిమా షూటింగ్ లకు సమాయత్తమవుతున్నారు. ప్రభాస్ నెక్స్ట్ వీక్ నుండి రాధేశ్యాం షూటింగ్ కి వెళ్లబోతుంటే సీనియర్ హీరోలైన నాగ్, బాలయ్య లు కూడా తమ సినిమాల షూటింగ్ కి సెట్స్ మీదికెళుతున్నారు.

సీనియర్ హీరోలకే లేని భయం మనకెందుకు జక్కన్నా మీరు షూట్ మొదలెట్టండి మేము సెట్స్ కి వచ్చేస్తాం అని ఎన్టీఆర్ – చరణ్ లు రాజమౌళికి కబురు పంపారట. ఇక కరోనా కారణంగా రాజమౌళి కూడా షూటింగ్ విషయంలో కాస్త సైలెంట్ గానే ఉన్నాడు. అందులోనూ రాజమౌళి కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. అయితే తాజాగా హీరోలు కూడా ఇచ్చిన భరోసాతో రాజమౌళి RRR షూటింగ్ విషయమై ఓ ప్లాన్ చేసినట్టుగా టాక్. దసరా పండగ తర్వాత RRR సెట్స్ మీదకెళ్లేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. ఈలోపు ఏ షెడ్యూల్ ఎలా మొదలు పెట్టాలి.. కరోనా ని ఎలా తట్టుకోవాలని రాజమౌళి ఆలోచిస్తాడట. ఇక నాలుగు నెలలోనే RRR షూటింగ్ పూర్తి చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టాలని రాజమౌళి చూస్తున్నడాట. మరి ఈ న్యూస్ తో ఎన్టీఆర్ – చరణ్ ల అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Tags:    

Similar News