ఎన్టీఆర్ ని బల్క్ డేట్స్ అడుగుతున్న దర్శకుడు!!

ఎన్టీఆర్ రాజమౌళి RRR షూటింగ్ కోసం రెండేళ్లుగా టైం స్పెండ్ చేసాడు. ఇంకా మరో ఆరు నెలల టైం పట్టేలా ఉంది. అయితే RRR తర్వాత ఎన్టీఆర్ [more]

Update: 2020-08-16 07:05 GMT

ఎన్టీఆర్ రాజమౌళి RRR షూటింగ్ కోసం రెండేళ్లుగా టైం స్పెండ్ చేసాడు. ఇంకా మరో ఆరు నెలల టైం పట్టేలా ఉంది. అయితే RRR తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలి. RRR తో పాటుగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కూడా చెయ్యాల్సి ఉండగా… ప్రస్తుతం ఏ సినిమా చేసే ఛాన్స్ కరోనా ఇవ్వడం లేదు. అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కి కమిట్ అయ్యాడనే న్యూస్ ఉండడం.. ఈమధ్యనే ఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ కి కథ చర్చలు జరిగినట్టుగా కూడా సోషల్ మీడియాలో టాక్ ఉంది.

తాజాగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చెయ్యబోయే సినిమాని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించడమే కాదు… ఈ సినిమా ని తెలుగు లో తెరకెక్కించి అన్ని భషాల్లో డబ్ చెయ్యకుండా.. తెలుగుతో పాటుగా అన్ని భాషల్లోనూ స్ట్రయిట్ మూవీగా తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడట. అందుకే ఎన్టీఆర్ ని ఏడాది పాటు బల్క్ డేట్స్ ఇవ్వాలని ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని కోరినట్టుగా ఫిలింనగర్ టాక్. మరి ఎన్టీఆర్ స్క్రిప్ట్ నచ్చితే ఒప్పుకోక ఏం చేస్తాడు చూద్దాం అంటున్నారు ఎన్టీఆర్ ఫాన్స్.

Tags:    

Similar News